తల్లి కాబోతున్న షకీరా | Shakira expecting a boy | Sakshi
Sakshi News home page

తల్లి కాబోతున్న షకీరా

Sep 10 2014 1:23 PM | Updated on Sep 2 2017 1:10 PM

తల్లి కాబోతున్న షకీరా

తల్లి కాబోతున్న షకీరా

'వాకా వాకా' అంటూ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన కొలంబియన్ పాప్ స్టార్ షకీరా.. త్వరలోనే తల్లి కాబోతోంది.

'వాకా వాకా' అంటూ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన కొలంబియన్ పాప్ స్టార్ షకీరా.. త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు నిర్ధరించారు. స్పానిష్ సాకర్ స్టార్ గెరార్డ్ పిక్తో కలిసి తాను రెండో బిడ్డను కనబోతున్నట్లు ఇటీవలే షకీరా కూడా చెప్పింది. ఇప్పుడు షకీరా తల్లి నిడియా, తండ్రి విలియం కూడా ఈ విషయం చెప్పారు.

షకీరాకు ఇప్పటికే మిలన్ అనే 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతగాడికి ఇప్పుడో బుజ్జి తమ్ముడు రాబోతున్నాడు. ఈసారి కూడా షకీరాకు అబ్బాయే పుట్టబోతున్నాడని, దాంతో మిలన్కు ఆడుకోడానికి ఓ బుల్లి తమ్ముడు వస్తాడని అమెరికా పత్రికలు చెప్పాయి. పిల్లాడే పుడతాడన్న విషయం తెలిసినా, పేరు మాత్రం ఇప్పటివరకు ఏమీ అనుకోలేదట.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
 
Advertisement
Advertisement