బఫెట్‌తో భోజనానికి రూ.23 కోట్లు.. | Rs 23 crore with a meal buffet | Sakshi
Sakshi News home page

బఫెట్‌తో భోజనానికి రూ.23 కోట్లు..

Jun 12 2016 1:05 AM | Updated on Sep 4 2017 2:15 AM

బఫెట్‌తో భోజనానికి రూ.23 కోట్లు..

బఫెట్‌తో భోజనానికి రూ.23 కోట్లు..

అపర కుబేరుడు, బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్‌తో కలసి భోంచేసేందుకు ఓ వ్యక్తి రూ.22,76,80,830 (3,456,789 డాలర్లు) చెల్లించనున్నాడు.

ఒమాహా: అపర కుబేరుడు, బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్‌తో కలసి భోంచేసేందుకు ఓ వ్యక్తి రూ.22,76,80,830 (3,456,789 డాలర్లు) చెల్లించనున్నాడు. స్వచ్ఛంద సంస్థ గ్లైడ్ ఫౌండేషన్‌కు నిధులను సమకూర్చేందుకు ప్రతి ఏడాదిలానే ‘ఈ-బే’లో బఫెట్ వేసిన వేలంలో ఆ మొత్తానికి పాడుకున్నాడు. విజేత తన పేరు వెల్లడించలేదు.

ఆ వ్యక్తి న్యూయార్క్‌లోని స్మిత్ అండ్ వాలెన్‌స్కై స్టీక్ హౌజ్‌లో బఫెట్‌తో భోజనం చేస్తారు. ఈ స్టీక్ హౌజ్ కూడా 10 వేల డాలర్లను గ్లైడ్‌కు దానం చేస్తోంది. గ్లైడ్ ఫౌండేషన్‌లో బఫెట్ తొలి భార్య సుజీ వలంటీర్‌గా పనిచేసేవారు. ఆమె 2004లో చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement