బెర్క్‌షైర్ హాత్వే పోర్ట్‌ఫోలియోలో షాకింగ్‌ మార్పులు! | berkshire hathaway 13f greg abel buys alphabet sells amazon | Sakshi
Sakshi News home page

బెర్క్‌షైర్ హాత్వే పోర్ట్‌ఫోలియోలో షాకింగ్‌ మార్పులు!

May 27 2026 9:47 PM | Updated on May 27 2026 9:50 PM

berkshire hathaway 13f greg abel buys alphabet sells amazon

బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బెర్క్‌షైర్ హాత్వే నూతన సీఈఓ గ్రెగ్ అబెల్, అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బఫెట్ చూపిన వ్యూహాత్మక మార్గంలోనే నడుస్తానని ప్రకటించిన అబెల్.. తాజాగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన ‘13F’ ఫైలింగ్‌లో సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. టెక్నాలజీ, బ్యాంకింగ్, కన్స్యూమర్ గూడ్స్‌లో ఆయన చేసిన కొన్ని కీలక మార్పులు ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అమెజాన్‌కు గుడ్‌బై..

సాధారణంగా టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులకు వారెన్ బఫెట్ దూరంగా ఉంటారు. కానీ, మార్కెట్ లీడర్ల వ్యూహాలను గమనించి 2019లో ఆయన అమెజాన్ షేర్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి గత ఏడాది ముగింపు నాటికి ఈ స్టాక్ ఏకంగా 160% లాభాలను తెచ్చిపెట్టింది.

అయితే, ప్రస్తుత సీఈఓ గ్రెగ్ అబెల్ అనూహ్యంగా అమెజాన్‌లోని కంపెనీ మొత్తం వాటాను (ఇది బెర్క్‌షైర్ పోర్ట్‌ఫోలియోలో 0.2% కంటే తక్కువ) విక్రయించారు. అదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న మరో దిగ్గజం గూగుల్ మాతృసంస్థ 'ఆల్ఫాబెట్'లో తన పెట్టుబడులను భారీగా పెంచారు.

ఆల్ఫాబెట్ క్లాస్-A షేర్లు: ఈ వాటాను ఏకంగా మూడు రెట్లు పెంచారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ వద్ద 5.42 కోట్లకు పైగా క్లాస్-A షేర్లు ఉన్నాయి. ఇది వారి మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5.9 శాతానికి సమానం.
ఆల్ఫాబెట్ క్లాస్-C షేర్లు: ఓటింగ్ హక్కులు లేని ఈ విభాగంలో కొత్తగా 35.8 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇది పోర్ట్‌ఫోలియోలో 0.4% వాటాగా ఉంది.

దిగ్గజ కంపెనీల నుండి పూర్తిగా నిష్క్రమణ

మార్కెట్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రెగ్ అబెల్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా ప్రక్షాళన చేశారు. దాదాపు 12 ప్రధాన కంపెనీల నుండి బెర్క్‌షైర్ హాత్వే పూర్తిగా తప్పుకుంది. అందులో ముఖ్యమైనవి చార్టర్ కమ్యూనికేషన్స్, డియాజియో,  అలెజియన్.

కీలక రంగాలలో వాటాల తగ్గింపు

ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అబెల్ నేతృత్వంలో బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లోని కొన్ని కీలక షేర్లను తగ్గించుకున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చెవ్రాన్, న్యూకోర్, కాన్ స్టెలేషన్ బ్రాండ్స్ లలో వాటాలను కొంతమేర విక్రయించారు. ఆర్థిక, ఫుడ్ రంగాలకు చెందిన ఇతర ప్రధాన షేర్లను కూడా భారీ మొత్తంలో వదిలించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement