breaking news
Greg Abel
-
బెర్క్‌షైర్‌లో భారీగా షేర్ల బై బ్యాక్..
వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్‌షైర్ హాత్వే పగ్గాలు చేపట్టిన గ్రెగ్ అబెల్.. కంపెనీ వద్ద పోగైన భారీ నగదు నిల్వలను క్రమంగా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు. 2026 రెండో త్రైమాసికంలో బెర్క్‌షైర్ హాత్వే దాదాపు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2021 తర్వాత ఒక త్రైమాసికంలో కంపెనీ చేసిన అతిపెద్ద బైబ్యాక్ ఇదే కావడం విశేషం.జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో బెర్క్‌షైర్ నిర్వహణ లాభాలు పన్నుల అనంతరం సుమారు 16 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు చేరాయి. రైల్వే, ఇంధన-విద్యుత్, తయారీ, సేవలు, రిటైల్ విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అయితే ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ లాభాలు తగ్గడం కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపింది.14 త్రైమాసికాల తర్వాత ఈక్విటీల కొనుగోలుబెర్క్షైర్లో అత్యంత ఆసక్తికరమైన మార్పు దాని పెట్టుబడి వ్యూహంలో కనిపించింది. వరుసగా 14 త్రైమాసికాల పాటు అమెరికా ఈక్విటీలను నికరంగా విక్రయించిన సంస్థ.. ఈసారి సుమారు 20 బిబిలియన్ డాలర్ల నికర స్టాక్ కొనుగోళ్లు చేసింది. ఫలితంగా జూన్ చివరి నాటికి కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన ఆస్తులు, అమెరికా ట్రెజరీ బిల్లుల నిల్వలు కలిపి సుమారు 365.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మార్చి చివర్లో ఈ మొత్తం దాదాపు 397.4 బిలియన్ డాలర్లుగా ఉంది.అయితే ఈ భారీ నగదు నిల్వ పూర్తిగా తగ్గిపోలేదు. బెర్క్‌షైర్ ఇప్పటికీ అమెరికాలోనే అత్యంత భారీ నగదు నిల్వ కలిగిన కంపెనీల్లో ఒకటిగా ఉంది. జూన్ చివరి నాటికి దాని వద్ద సుమారు 325 బిలియన్ డాలర్ల ట్రెజరీ బిల్లులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.గూగుల్‌పై 10 బిలియన్ డాలర్ల బెట్టింగ్గ్రెగ్ అబెల్ నాయకత్వంలో బెర్క్‌షైర్ భారీగా పెట్టుబడులు పెడుతున్న మరో రంగం టెక్నాలజీ. కంపెనీ రెండో త్రైమాసికంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఈ పెట్టుబడితో ఆల్ఫాబెట్ బెర్క్‌షైర్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలోని టాప్-5 హోల్డింగ్స్‌లోకి చేరింది. చెవ్రాన్ స్థానాన్ని ఆల్ఫాబెట్ ఆక్రమించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆల్ఫాబెట్ భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.టేలర్ మోరిసన్ కొనుగోలుతో హౌసింగ్‌లో అడుగుఅబెల్ నాయకత్వంలో బెర్క్‌షైర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రముఖ హోమ్‌బిల్డర్ టేలర్ మోరిసన్ హోమ్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో షేరుకు 72.50 డాలర్ల చొప్పున నగదు చెల్లించే ఈ డీల్‌లో ఈక్విటీ విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు, మొత్తం ఎంటర్ప్రైజ్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. బెర్క్‌షైర్ ఇప్పటికే క్లేటన్ హోమ్స్, ఇతర బిల్డింగ్ ప్రొడక్ట్స్ వ్యాపారాల ద్వారా హౌసింగ్ రంగంలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశం కల్పిస్తుంది.బఫెట్‌తో పోలిస్తే భిన్నమైన దిశవారెన్ బఫెట్ కాలంలో బెర్క్‌షైర్ భారీ నగదు నిల్వలను కొనసాగిస్తూ, ఆకర్షణీయమైన విలువలు కనిపించే వరకు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండేది. ముఖ్యంగా అమెరికా షేర్ల విలువలు అధికంగా ఉన్నాయంటూ బఫెట్ పలుమార్లు హెచ్చరించారు. అయితే 2026లో అబెల్ నాయకత్వం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్‌లు, ఆల్ఫాబెట్లో భారీ పెట్టుబడి, టేలర్ మోరిసన్ కొనుగోలు.. బెర్క్‌షైర్ తన నగదు నిల్వలను మరింత చురుగ్గా వినియోగించేందుకు సిద్ధమవుతోందనే సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు చూస్తున్నారు.అయితే ఈ మార్పుల మధ్య బెర్క్‌షైర్ షేరు పనితీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆగస్టు 7న మార్కెట్ ముగిసే సమయానికి క్లాస్-B షేర్లు ఈ ఏడాది సుమారు 3.8 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో S&P 500 దాదాపు 13 శాతం లాభపడింది. దీంతో అబెల్ తీసుకుంటున్న కొత్త పెట్టుబడి నిర్ణయాలు బెర్క్‌షైర్‌కు దీర్ఘకాలంలో ఎంత మేర విలువను సృష్టిస్తాయన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల ప్రధాన ప్రశ్నగా మారింది. -
బెర్క్‌షైర్ హాత్వే పోర్ట్‌ఫోలియోలో షాకింగ్ మార్పులు!
బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బెర్క్‌షైర్ హాత్వే నూతన సీఈఓ గ్రెగ్ అబెల్, అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బఫెట్ చూపిన వ్యూహాత్మక మార్గంలోనే నడుస్తానని ప్రకటించిన అబెల్.. తాజాగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన ‘13F’ ఫైలింగ్‌లో సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. టెక్నాలజీ, బ్యాంకింగ్, కన్స్యూమర్ గూడ్స్‌లో ఆయన చేసిన కొన్ని కీలక మార్పులు ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.అమెజాన్‌కు గుడ్‌బై..సాధారణంగా టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులకు వారెన్ బఫెట్ దూరంగా ఉంటారు. కానీ, మార్కెట్ లీడర్ల వ్యూహాలను గమనించి 2019లో ఆయన అమెజాన్ షేర్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి గత ఏడాది ముగింపు నాటికి ఈ స్టాక్ ఏకంగా 160% లాభాలను తెచ్చిపెట్టింది.అయితే, ప్రస్తుత సీఈఓ గ్రెగ్ అబెల్ అనూహ్యంగా అమెజాన్‌లోని కంపెనీ మొత్తం వాటాను (ఇది బెర్క్‌షైర్ పోర్ట్‌ఫోలియోలో 0.2% కంటే తక్కువ) విక్రయించారు. అదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న మరో దిగ్గజం గూగుల్ మాతృసంస్థ 'ఆల్ఫాబెట్'లో తన పెట్టుబడులను భారీగా పెంచారు.ఆల్ఫాబెట్ క్లాస్-A షేర్లు: ఈ వాటాను ఏకంగా మూడు రెట్లు పెంచారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ వద్ద 5.42 కోట్లకు పైగా క్లాస్-A షేర్లు ఉన్నాయి. ఇది వారి మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5.9 శాతానికి సమానం.ఆల్ఫాబెట్ క్లాస్-C షేర్లు: ఓటింగ్ హక్కులు లేని ఈ విభాగంలో కొత్తగా 35.8 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇది పోర్ట్‌ఫోలియోలో 0.4% వాటాగా ఉంది.దిగ్గజ కంపెనీల నుండి పూర్తిగా నిష్క్రమణమార్కెట్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రెగ్ అబెల్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా ప్రక్షాళన చేశారు. దాదాపు 12 ప్రధాన కంపెనీల నుండి బెర్క్‌షైర్ హాత్వే పూర్తిగా తప్పుకుంది. అందులో ముఖ్యమైనవి చార్టర్ కమ్యూనికేషన్స్, డియాజియో, అలెజియన్.కీలక రంగాలలో వాటాల తగ్గింపుఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అబెల్ నేతృత్వంలో బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లోని కొన్ని కీలక షేర్లను తగ్గించుకున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చెవ్రాన్, న్యూకోర్, కాన్ స్టెలేషన్ బ్రాండ్స్ లలో వాటాలను కొంతమేర విక్రయించారు. ఆర్థిక, ఫుడ్ రంగాలకు చెందిన ఇతర ప్రధాన షేర్లను కూడా భారీ మొత్తంలో వదిలించుకున్నారు. -
బెర్క్‌షైర్ హాత్వే కొత్త సీఈఓ: వేతనం ఎన్ని కోట్లంటే?
ప్రముఖ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా వైదొలగిన తరువాత.. 'గ్రెగ్ అబెల్' బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేవలం బఫెట్ వారసుడిగానే మాత్రమే కాకుండా.. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రముఖులలో ఒకరుగా నిలిచారు.2026 సంవత్సరానికి అబెల్ వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. ఇది 2024లో తీసుకున్న వేతనం కంటే 19 శాతం ఎక్కువ. అంతే కాకుండా ఈ జీతం వారెన్ బఫెట్ వేతనం కంటేఎక్కువ కావడం గమనార్హం.95 సంవత్సరాల వయసులో.. వారెన్ బఫెట్ పదవీ విరమణ చేసిన తరువాత, ఈ ఏడాది జనవరి 1 నుంచి గ్రెగ్ అబెల్ అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. బెర్క్‌షైర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతే కాకుండా కంపెనీకి చెందిన నాన్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించారు.కెనడాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన గ్రెగ్ అబెల్, బఫెట్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరుపొందారు. ఆయన వద్ద ప్రస్తుతం సుమారు 171 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ షేర్లు ఉన్నాయి. 2022లో బెర్క్‌షైర్ హాత్వే ఎనర్జీలో తన 1 శాతం వాటాను కంపెనీకే విక్రయించి 870 మిలియన్ డాలర్లు పొందారు. ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్, బెర్క్‌షైర్ హాతవేను కొత్త యుగంలోకి నడిపించడమే కాకుండా.. అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరిగా నిలిచారు.ఇదీ చదవండి: 2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!


