విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్కు జైలు శిక్ష | Principal gets prison term for beating student in Bhutan | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్కు జైలు శిక్ష

Jul 20 2014 9:25 PM | Updated on Sep 2 2017 10:36 AM

భూటాన్లో ఓ విద్యార్థిని చితకబాదినందుకు ప్రిన్సిపాల్కు మూడు నెలల జైలు శిక్ష పడింది.

థింపు: భూటాన్లో ఓ విద్యార్థిని చితకబాదినందుకు ప్రిన్సిపాల్కు మూడు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతో పాటు 11,250 రూపాయిల జరిమానా కూడా విధించింది. మోంగర్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. విద్యార్థిని ఏడాది పాటు పాఠశాల నుంచి సస్సెండ్ చేసినందుకుగాను ప్రిన్సిపాల్ అతనికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

విద్యార్థి పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, జూనియర్ విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించాడని ప్రిన్సిపాల్ కోర్టుకు తెలిపాడు. అయితే ప్రిన్సిపాల్ విద్యార్థిని కేబుల్ వైర్తో విచక్షణరహితంగా కొట్టడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. విద్యార్థి పట్ల క్రూరంగా వ్యవహరించడం జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని కోర్టు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement