breaking news
beating student
-
విద్యార్థిని చితకబాదిన టీచర్ అరెస్ట్
హౌరా: క్లాసులో మాట్లాడినందుకు ఎనిమిదో తరగతి విద్యార్థిని టీచర్ ఇనుప చైన్లతో విచక్షణ రహితంగా కొట్టాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అమానుషంగా ప్రవర్తించిన హిందీ టీచర్ జయప్రకాశ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హౌరాలోని ఓ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో గురువారం ఈ సంఘటన జరిగింది. -
విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్‌కు జైలు శిక్ష
థింపు: భూటాన్‌లో ఓ విద్యార్థిని చితకబాదినందుకు ప్రిన్సిపాల్‌కు మూడు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతో పాటు 11,250 రూపాయిల జరిమానా కూడా విధించింది. మోంగర్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. విద్యార్థిని ఏడాది పాటు పాఠశాల నుంచి సస్సెండ్ చేసినందుకుగాను ప్రిన్సిపాల్ అతనికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విద్యార్థి పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, జూనియర్ విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించాడని ప్రిన్సిపాల్ కోర్టుకు తెలిపాడు. అయితే ప్రిన్సిపాల్ విద్యార్థిని కేబుల్ వైర్‌తో విచక్షణరహితంగా కొట్టడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. విద్యార్థి పట్ల క్రూరంగా వ్యవహరించడం జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని కోర్టు పేర్కొంది.