హలో.. నేను బరాక్ ఒబామాను! | Obama surprises three women with Mother's Day phone calls | Sakshi
Sakshi News home page

హలో.. నేను బరాక్ ఒబామాను!

May 11 2015 7:57 PM | Updated on Apr 4 2019 5:04 PM

హలో..  నేను బరాక్ ఒబామాను! - Sakshi

హలో.. నేను బరాక్ ఒబామాను!

అమెరికాలో ఇటీవల ముగ్గురు మహిళలకు ఫోన్ కాల్ వచ్చింది.

వాషింగ్టన్: అమెరికాలో ఇటీవల ముగ్గురు మహిళలకు ఫోన్ కాల్ వచ్చింది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్నది వారు ఊహించలేకపోయారు. ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి సాక్ష్యాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా..! అంతే ఆ ముగ్గురు మహిళలకు ఈ విషయం తెలియగానే సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు.

ఈ ముగ్గురు మహిళలు ఇటీవల ఒబామాకు ఉత్తరం రాశారు. వైట్ హౌస్ నుంచి ఫోన్ చేస్తామని వారికి కబురు వచ్చింది. అయితే ఒబామా ఫోన్ చేస్తారని వారు ఊహించలేకపోయారు. గత బుధవారం ఒబామా వారికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పిల్లల పెంపకంలో తల్లి ఎంత కష్టపడుతుందో గుర్తు చేసుకుంటూ ఒబామా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా దినోత్సవం అయిన ఆదివారం రోజు వైట్ హౌస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒబామా తల్లి ఆన్ డన్హమ్ 1995లో కేన్సర్తో మరణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement