భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం | obama praises indian origon interprinnuers | Sakshi
Sakshi News home page

భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం

Aug 5 2015 9:57 AM | Updated on Sep 3 2017 6:50 AM

భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం

భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం

భారత సంతతికి చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను (స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్లు) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సత్కరించనున్నారు.

వాషింగ్టన్:  భారత సంతతికి చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను (స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్లు) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సత్కరించనున్నారు. వీరిలో ప్రవాహిని బ్రాడూ(శాన్‌ఫ్రాన్సిస్కో), మేరీ శాస్త్రి(మిచిగాన్), సుమా రెడ్డి(న్యూయార్క్) ఉన్నారు. అమెరికా ప్రజలు ప్రతిరోజూ 50 ఫుట్‌బాల్ మైదానాలకు సరిపోయే సెల్‌ఫోన్లను పడేస్తున్నారని వైట్‌హౌస్ తెలిపింది. వీటిల్లో విలువైన ఖనిజాలు కూడా ఉంటున్నాయి. బ్రాడూ 'బ్లూఓక్'అనే ఎలక్ట్రానిక్ రీసైకిల్ కంపెనీని స్థాపించారు. దీని ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాలను వెలికితీస్తున్నాడు.

మేరీ శాస్త్రి మెటీరియల్ సైన్స్ ఉపయోగించి కొత్త తరం లిథియం బ్యాటరీలు తయారు చేస్తున్నాడు. ఇక సుమారెడ్డి స్నేహితుల రేటింగ్స్, రివ్యూస్, రికమెండేషన్స్ ఆధారంగా సందర్శించాల్సిన అద్భుత ప్రదేశాలను ఎంపిక చేసుకునే వాడ్లి అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించింది.

Advertisement
 
Advertisement
Advertisement