పీటర్‌ హండ్కేకు సాహిత్యంలో నోబెల్‌

Nobel Prize In Literature Awarded To Austrian Author Peter - Sakshi

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా రచయిత పీటర్‌ హండ్కేకు 2019 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్‌ బహుమతి దక్కింది. భాషా చాతుర్యంతో ప్రభావశీలతతో కూడిన అసమాన కృషితో పాటు మానవ అనుభవం యొక్క విశిష్టతను అన్వేషించినందుకుగాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్‌లో అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఒకడిగా పీటర్‌ హండ్కే ఎదిగారని సాహిత్యంలో నోబెల్‌ బహుమతి ప్రకటించిన స్వీడిష్‌ అకాడమీ పేర్కొంది. 2018 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌కు పోలండ్‌కు చెందిన రచయిత ఓల్గా టొకార్జక్‌ను ఎంపిక చేశారు.

స్వీడన్‌ వ్యాపారవేత్త, కెమిస్ట్‌, ఇంజనీర్‌ ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ అభీష్టం మేరకు ఏర్పాటు చేసిన అయిదు అంతర్జాతీయ అవార్డుల్లో సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌ ఒకటి. ఇక ఈ ఏడాది వైద్యంలో నోబెల్‌ ప్రైజ్‌ శాస్త్రవేత్తలు విలియం కెలిన్‌, పీటర్‌ జే రాట్‌క్లిఫ్‌, గ్రెగ్‌ ఎల్‌ సెమెంజలకు లభించింది. విశ్వం ఆవిర్భావ గుట్టును విప్పినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్‌ పీబల్స్‌, మైఖేల్‌ మేయర్‌, ఖ్వెలోజ్‌లను ఫిజిక్స్‌ నోబెల్‌ ప్రైజ్‌ వరించింది. మరోవైపు ఇథియం-ఇయాన్‌ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు గాను జాన్‌ బి గుడ్‌ఎనఫ్‌, ఎం స్టాన్లీ విటింగ్‌హామ్‌, అఖిర యొషినోలకు కెమిస్ర్టీలో నోబెల్‌ బహుమతి దక్కింది. నోబెల్‌ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకంటించనుండగా ఎకనమిక్స్‌లో నోబెల్‌ ప్రైజ్‌గా గుర్తింపు పొందిన నోబెల్‌ మెమోరియల్‌ ప్రైజ్‌ ఇన్‌ ఎకనమిక్‌ సైన్సెస్‌ను సోమవారం వెల్లడిస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top