కంబోడియాలో ఘోర రోడ్డు ప్రమాదం | Nine killed in Cambodia bus and truck collisioned incident | Sakshi
Sakshi News home page

కంబోడియాలో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 30 2016 7:36 AM | Updated on Aug 30 2018 4:07 PM

కంబోడియాలో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

కంబోడియాలో ఘోర రోడ్డు ప్రమాదం

కంబోడియాలో సోమవారం అర్దరాత్రి తర్వాత సమయంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.

కంబోడియాలో సోమవారం అర్దరాత్రి తర్వాత సమయంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కంబోడియాలోని బట్టాంబాంగ్ ప్రాంతంలో మాంగ్ రస్సె జిల్లాలో వేగంగా వెళ్తున్న ట్రక్, మినీ బస్ ఢీకొన్నట్లు ఓ అధికారి తెలిపారు.

ట్రక్ డ్రైవర్ ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.  రెండు వాహనాల డ్రైవర్లు సహా మరో ఏడుగురు మృతిచెందగా, దాదాపు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement