డిసెంబర్‌ 14న ఏం తేలబోతుంది? | NASA Major Announcement on Aliens Life | Sakshi
Sakshi News home page

Dec 12 2017 8:53 AM | Updated on Jun 4 2019 6:19 PM

NASA Major Announcement on Aliens Life - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్‌ 14న నాసా చేయబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నాయా?.. వాటి మనుగడ ఎలా కొనసాగుతోంది? వాటి వల్ల మానవాళికి నిజంగా ముప్పు ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆరోజే దొరకబోతోంది. 

అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం నాసా గత కొన్నేళ్లుగా ఈ విషయపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కెప్ల‌ర్ స్పేస్‌ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న శాస్త్ర‌వేత్త‌లకి 2500కి పైగా ఏలియన్ల జాడలు క‌నిపించినట్లు స‌మాచారం. ఈ మేరకు అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని గురువారం నిర్వహించబోయే సమావేశంలో వెల్లడించనున్నారు.  

గోల్డీలాక్ జోన్‌లో ఇవి ప‌రిభ్ర‌మించే ప్రాంతాలను గుర్తించారు. జీవ‌జాలం అభివృద్ధి చెంద‌డానికి ఆ ప్రాంతాల ప‌రిస్థితులు అనుకూలిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు గ‌తంలోనే వెల్ల‌డించారు. గూగుల్ సంస్థ అందించిన మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్ల‌ర్ టెలిస్కోప్ గుర్తించిన గ్ర‌హాల‌ను నాసా అధ్య‌య‌నం చేసింది. వాషింగ్టన్‌లోని నాసా హెడ్‌ క్వార్టర్స్‌ డైరెక్టర్ పౌల్‌ హెర్ట్జ్‌ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement