నక్షత్రాలతో సెల్ఫీ కావాలా?

NASA app lets you click selfies with galaxies - Sakshi

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని... అని పాడుకోవడమే కాదు.. ఇకపై నక్షత్రాలతో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు.

అంతరిక్షంలోకి టూర్‌.. జాబిలిపై ఇల్లు... అరుణ గ్రహంపై కాలనీ!
తరచూ కనిపించే ఇలాంటి వార్తలను చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా అనిపించ వచ్చుగానీ, ఇవన్నీ బాగా డబ్బున్న వారికే సాధ్యమయ్యే పనులని కూడా స్పష్టమైపోతుంది. కోట్లకు కోట్లు పోసి అంతరిక్షానికి అందరూ వెళ్లలేరుగా. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటంటారా? అంతరిక్షంలో ఉన్న ఫీలింగ్‌ ఇచ్చే సెల్ఫీలు తీసుకోవచ్చు అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ! విషయం ఏంటంటే.. స్పీట్జర్‌ స్పేస్‌ టెలిస్కోపును ప్రయోగించి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా నాసా ఓ వినూత్నమైన స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది.

ఐఫోన్‌తోపాటు ఆండ్రాయిడ్‌కూ అందుబాటులోఉన్న ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి కనిపించే ఫ్రేమ్‌ మధ్యలో మన ముఖం ఉండేలా చూసుకుని ఫొటో తీసుకుంటే చాలు. అంతరిక్ష వ్యోమగామి స్టైల్లో మన తలకు ఓ హెల్మెట్‌ అమరిపోతుంది. ఆ తరువాత గత 15 ఏళ్లలో స్పీట్జర్‌ తీసిన వందలాది అద్భుతమైన నక్షత్ర మండలాలు, అంతరిక్ష ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌తో సెల్ఫీ సిద్ధమైపోతుంది.

చిన్న ఇబ్బంది కూడా ఉందండోయ్‌..
ఈ సెల్ఫీలను నేరుగా ఆప్‌ ద్వారానే షేర్‌ చేసుకునే వీల్లేదు. గ్యాలరీలోకి వెళ్లి ఫొటోలు సెలెక్ట్‌ చేసుకుని సామాజిక మాధ్యమాల్లోకి షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది

అప్లికేషన్‌ పేరు ఏంటంటారా?
నాసా సెల్ఫీస్‌ అని ప్లేస్టోర్‌లో సెర్చ్‌ చేయడమే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top