చిన్నప్పుడే నాపై లైంగిక దాడి: నదియా | Nadiya Hussain Reveals She Was Abused At The Age of 15 | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడే నాపై లైంగిక దాడి: నదియా

Nov 8 2019 6:13 PM | Updated on Nov 8 2019 6:14 PM

Nadiya Hussain Reveals She Was Abused At The Age of 15 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఐదేళ్ల వయస్సులోనే నాపై లైంగిక దాడి జరిగింది. సమీప బంధువే ఈ ఘోరానికి పాల్పడ్డారు. పదేళ్ల వరకు ఇది నన్ను తీవ్రంగా బాధిస్తూ వచ్చింది. పదవ ఏటా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం రాస్తున్నప్పుడు నేను నగ్నంగా నిలబడ్డట్లు నా మీద నాకు అసహ్యం వేసింది. నా జ్ఞాపకాల్లో నుంచి ఈ విషయాన్ని బయట పెట్టకుండా దాచ్చేమనుకున్నాను. నా భర్తే నన్ను ప్రోత్సహించారు. నీ అనుభవాలు బయటకు చెప్పడంలో తప్పులేదంటూ భుజం తట్టారు. ధౌర్యంగా ఈ విషయాలను ఇటీవల విడుదల చేసిన ‘ఫైండింగ్‌ మై వాయిస్‌’ పుస్తకంలో రాశాను. ఇప్పుడు మీ ముందు చెబుతున్నాను’ అని ఐటీవీ నిర్వహిస్తున్న ‘గుడ్‌మార్నింగ్‌ బ్రిటన్‌ టుడే’ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన నదియా హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. 

పత్రికా కాలమిస్ట్, రచయిత, టీవీ వ్యాఖ్యాతగా ప్రశంసలు అందుకుంటున్న 34 ఏళ్ల నదియా హుస్సేన్‌ ‘ద గ్రేట్‌ బ్రిటీష్‌ బేక్‌ ఆఫ్‌’ పోటీల్లో అవార్డు కూడా అందుకున్నారు. ‘నాలాంటి అనుభవాలు ప్రపంచంలో చాలా మందికి జరిగే ఉంటాయి. వారందరు నాలాగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటే. సమాజంలో మార్పుకు అవకాశం ఉంటుందన్న చిన్న ఆశ’ అని ఆమె చెప్పారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement