'గల్ఫ్ దేశాలతో తెలంగాణకు అవినాభావ సంబంధం' | MP kavitha talks about gulf countries will have good relation with telangana state | Sakshi
Sakshi News home page

'గల్ఫ్ దేశాలతో తెలంగాణకు అవినాభావ సంబంధం'

Jun 13 2015 8:21 PM | Updated on Aug 21 2018 3:10 PM

'గల్ఫ్ దేశాలతో తెలంగాణకు అవినాభావ సంబంధం' - Sakshi

'గల్ఫ్ దేశాలతో తెలంగాణకు అవినాభావ సంబంధం'

గల్ఫ్ దేశాలలో తెలంగాణ జాగృతిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన తన మూడు రోజుల పర్యటనను శనివారం ముగించుకోని..

బహ్రెయిన్: గల్ఫ్ దేశాలలో తెలంగాణ జాగృతిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన తన మూడు రోజుల పర్యటనను శనివారం ముగించుకోని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు కె. కవిత భారతదేశానికి తిరిగి పయనమయ్యారు. బహ్రెయిన్ లో శుక్రవారం రాత్రి గల్ఫ్ తెలంగాణ జాగృతి నేత సిహెచ్. హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో అమె పాల్గోన్నారు.

పెద్ద సంఖ్యలో వచ్చిన సభికులను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఆశయ సాధనలో ప్రవాసీయుల పాత్ర గూర్చి వివరించారు. గల్ఫ్ దేశాలతో తెలంగాణ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉందని, అందుకే జాగృతి ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తుందని అమె పేర్కొన్నారు.  అన్ని గల్ఫ్ దేశాలలో తెలంగాణ జాగృతి శాఖలు ఏర్పాటు చేసి ప్రవాసీయులతో సమన్వయం చేస్తున్నామని కవిత అన్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement