వలలో పడ్డ 23 కోట్లు.. వదిలేశాడు!

Man Catches Tuna Fish Worth RS 23 Crore And Throw It - Sakshi

ఐర్లాండ్‌లోని వెస్ట్‌కార్క్‌కు చెం దిన డేవ్‌ ఎడ్వర్డ్స్‌కు సముద్రంలో ఒక భారీ ట్యూనా చేప చిక్కింది. దాని విలువ అక్షరాలా మూడు మిలియన్ల యూరోలు. మన కరెన్సీలో చెప్పా లంటే దాదాపు రూ. 23 కోట్లు. అయితే, డేవ్‌ అమ్మడానికి ఎప్పుడూ చేపలు పట్టలేదు. అట్లాంటిక్‌ సముద్రంలో చేపలపై అధ్యయనం కూడా ఆయన సరదాలో భాగమే. ఇదే కోవలో ఆయన చేపలు పడు తుండగా ఈ ఎనిమిదన్నర అడుగుల భారీ చేప చిక్కింది. ట్యూనా చేపకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా 270 కేజీలు ఉన్న మత్స్యరాజం విలువ 23 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేసిన అనంతరం ట్యూనాను  తిరిగి సముద్రంలోకి  వదిలేశానని తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top