చైనాలో ఘోర ప్రమాదం: 19 మంది మృతి | LPG Tanker Truck Explosion In China 19 People Deceased | Sakshi
Sakshi News home page

చైనాలో ఘోర ప్రమాదం: 19 మంది మృతి

Jun 14 2020 8:10 PM | Updated on Jun 14 2020 8:22 PM

LPG Tanker Truck Explosion In China 19 People Deceased - Sakshi

బీజింగ్‌: చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ చైనాలో ఓ ట్రక్‌ పేలిపోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 19 మంతి మృతి చెందగా, 170 మంది గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఎల్‌పీజీ గ్యాస్‌తో వెళ్తున్న ఓ ట్రక్‌ జెజియాంగ్ ప్రావిన్స్‌లోని లియాంగ్‌షాన్ గ్రామం వద్ద గల హైవే మీద పేలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, పేలిపోయిన ట్రక్‌ను హైవేకు సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోకి తరలించగా.. అక్కడ ట్రక్‌లో మరోసారి పేలుడు సంభవించినట్లు తెలిపారు. దాంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఓ భవనం పేలుడు ధాటికి శిథిలమైంది. (ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళన..)

ఘటనపై వెన్లింగ్ డిప్యూటీ మేయర్ ఝు మింగ్లియన్ మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సాయం అందించేందుకు 2,600 మంది రెస్క్యూ సిబ్బందిని పంపినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. (కీలక దశలో చైనా వ్యాక్సిన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement