అమెరికాలో భారతీయ వైద్యుడి కాల్చివేత | Keralite doctor found dead inside car in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయ వైద్యుడి కాల్చివేత

May 7 2017 1:15 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలోని మిషిగాన్‌లో భారత్‌కు చెందిన డాక్టర్‌ రమేశ్‌ (32) హత్యకు గురయ్యారు.

మిషిగాన్‌: అమెరికాలోని మిషిగాన్‌లో భారత్‌కు చెందిన డాక్టర్‌ రమేశ్‌ (32) హత్యకు గురయ్యారు. కేరళకు చెందిన రమేశ్‌ డెట్రాయిట్‌లోని హెన్రీ ఫోర్డ్‌ ఆసుపత్రిలో ఈ యూరాలజిస్టుగా పనిచేస్తున్నారు.

గురువారం ఇంటినుంచి డ్యూటీకి బయలుదేరిన రమేశ్‌ ఆసుపత్రికి చేరుకోకపోవటం, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవటంతో ఆయన తండ్రి డాక్టర్‌ నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషిగాన్‌ హైవేపై రెస్ట్‌ బేలో కారు వెనుకసీట్లో రమేశ్‌ను ఎవరో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలేవీ పోలీసులు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement