breaking news
Dr. Ramesh
-
పిల్లలు ఫిట్స్ (మూర్ఛ)తో బాధపడుతుంటే డాక్టర్‌ను అడగాల్సిన మూడు ప్రశ్నలు!
భారతదేశంలో లక్షలాది మంది పిల్లలు ఫిట్స్ / ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. 2025లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎమ్ఎస్) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... చిన్నారుల్లో ఈ ఎపిలెప్సీ వ్యాధి విస్తృతి 0.8% ఉంది. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే పిల్లల్లో ఎక్కడ వివక్షకు గురవుతారో అనే ఆందోళనతో ఈ వ్యాధి ఉందని తెలపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. అందుకే పిల్లలు ఫిట్స్ / మూర్ఛ (ఎపిలెప్సీ)తో బాధపడుతూ... రెండు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఫిట్స్ ఆగకుండా వస్తూనే ఉంటే... డాక్టర్‌ను మూడు ప్రశ్నలు అడగటం మంచిది. ఈ మూడు ప్రశ్నలూ పిల్లల జీవితాన్నే మార్చేయవచ్చు. ఇంతకీ ఆ మూడు ప్రశ్నలేమిటో చూద్దాం...→ మొదటి ప్రశ్న: రెండు మందులు వాడుతున్నప్పటికీ పిల్లలకు ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. అవి ఆగడానికి శస్త్రచికిత్స (సర్జికల్) అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? డాక్టర్ జవాబు : ఫిట్స్‌తో బాధపడే చిన్నారుల్లో మూడింట ఒక వంతు మందికి మందులతో తగ్గని ఎపిలెప్సీ (డ్రగ్–రెసిస్టెంట్ ఎపిలెప్సీ) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై చాలామంది తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండదు. అంటే... ఈ పిల్లల్లో ఎలాంటి మందులు వాడినా దాదాపుగా ఫిట్స్ అదుపులోకి రాకపోవచ్చు. అప్పుడు ఆ పిల్లలకు శస్త్రచికిత్స చివరి ప్రయత్నం మాత్రమే కాదు... వైద్యపరంగా అది ఆ తర్వాతి చికిత్సాప్రక్రియను తెలుసుకునే అంశం కూడా. శస్త్రచికిత్స ద్వారా 50 నుంచి 86 శాతం కేసుల్లో ఫిట్స్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ఎంతకీ ఫిట్స్ తగ్గని కేసుల్లో ఒకసారి ఈ ప్రశ్న డాక్టర్‌ను అడగటం మంచిది. → రెండో ప్రశ్న: సాధారణ బ్రెయిన్ స్కాన్ మాత్రమే కాకుండా, ఎపిలెప్సీ-ప్రోటోకాల్ ఎమ్మారై చేయించారా?డాక్టర్ జవాబు : మందులకు లొంగని ఫిట్స్‌కు కారణమయ్యే కొన్ని లోపాలు సాధారణ మెదడు స్కాన్లలో తరచుగా కనిపించకపోవచ్చు. ఇలాంటి పిల్లలకు ఎపిలెప్సీ-ప్రోటోకాల్ అనేది ఓ ప్రత్యేకమైన ఎమ్మారై పరీక్ష. అంతేకాదు... దీని రెజల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఇది మెదడులోని ఫిట్స్ ఆవిర్భవిస్తున్న ప్రాంతాన్ని (సీజర్ ఫోకస్‌ను) గుర్తిస్తుంది. ఈ పరీక్ష లేకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన చికిత్స ప్రణాళికను మొదలుపెట్టడం సాధ్యం కాదు. అందుకే ఇలాంటి చిన్నారులు చాలామందికి చేసిన ఎమ్మారై నార్మల్‌గానే ఉందంటూ డాక్టర్లు ఆ పిల్లల పేరెంట్స్‌కు చెప్పవచ్చుగానీ... నిజానికి అది ఎపిలెప్సీ-ప్రోటోకాల్ ఎమ్మారై కాకపోవచ్చు.→ మూడో ప్రశ్న: వీడియో–ఈఈజీ మానిటరింగ్ గురించి మీ డాక్టర్‌ను అడిగారా? డాక్టర్ జవాబు : ఫిట్స్ వచ్చినప్పుడు పిల్లల మెదడులోని విద్యుత్ తరంగాలను ‘వీడియో ఈఈజీ’ (వీడియో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్) పరీక్ష గుర్తిస్తుంది. ఆటైమ్‌లో వారి ప్రవర్తనలో కనిపించే మార్పులనూ ఇది రికార్డు చేస్తుంది. ఫలితంగా మెదడులోని ఏ ప్రాంతం నుంచి ఫిట్స్ వస్తున్నాయో మరింత కచ్చితంగా / నిశితంగా గుర్తించవచ్చు. శస్త్రచికిత్స అవసరమా లేదా అని అంచనా వేయడానికి ఇది అత్యంత కీలకమైన పరీక్ష. పిల్లలకు మందులతో అదుపులోకి రాని ఎపిలెప్సీ ఉంటే, వీడియో–ఈఈజీ గురించి తల్లిదండ్రులే ఒకసారి అడగవచ్చు. చాలా కుటుంబాలు ఫిట్స్ వ్యాధిని మౌనంగా భరిస్తుంటాయి. సమాజంలో ఎదురయ్యే వివక్ష నుంచి పిల్లలను కాపాడటానికి సమస్యను దాచిపెడుతుంటారు. కానీ అలా చేయడం వైద్యపరీక్షలూ, చికిత్సలూ ఆలస్యం అవడం వల్ల ఫిట్స్‌ను పూర్తిగా తగ్గించే అవకాశాలు సన్నగిల్లే ముప్పు ఎక్కువ. అందుకే పిల్లల చికిత్స మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ మూడు ప్రశ్నలను పేరెంట్లే అడగవచ్చు. ఒకవేళ తమ డాక్టర్‌ను అడగటం మొహమాటంగా ఉంటే సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోవచ్చు. ఆ సమాధానాలు చిన్నారిని ఫిట్స్ నుంచి పూర్తిగా విముక్తులను చేసే అవకాశాలెక్కువ. డాక్టర్ రమేష్ శిఘకొల్లిసీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
అమెరికాలో భారతీయ వైద్యుడి కాల్చివేత
మిషిగాన్: అమెరికాలోని మిషిగాన్‌లో భారత్‌కు చెందిన డాక్టర్ రమేశ్ (32) హత్యకు గురయ్యారు. కేరళకు చెందిన రమేశ్ డెట్రాయిట్‌లోని హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో ఈ యూరాలజిస్టుగా పనిచేస్తున్నారు. గురువారం ఇంటినుంచి డ్యూటీకి బయలుదేరిన రమేశ్ ఆసుపత్రికి చేరుకోకపోవటం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో ఆయన తండ్రి డాక్టర్ నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషిగాన్ హైవేపై రెస్ట్ బేలో కారు వెనుకసీట్లో రమేశ్‌ను ఎవరో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలేవీ పోలీసులు వెల్లడించలేదు. -
రంగంలోకి వైద్య సిబ్బంది
ఒంగోలు సెంట్రల్ : స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మరణించడంతో ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ టి.రమేష్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ హాలులో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యన మాట్లాడుతూ అద్దంకి క్లస్టర్ పరిధిలోని జె.పంగులూరు మండలం, జాగర్లమూడి వారిపాలేనికి చెందిన జి.బాలు అలియాస్ (27) శివకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే పూనేలోని వైరాలజీ ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే స్వైన్ ప్లూగా నిర్థారించాల్సి ఉందన్నారు. 240 గృహాలను సంధర్శించి ప్రజలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా, తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నారు. అలాంటి వారికి దగ్గరగా ఉన్నా, కరచాలనం చేసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందన్నారు. రిమ్స్ అత్యవసర చికిత్స వార్డులో ఆరు బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసిన్నట్లు, వెంటిలేటర్లను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ వై. రాజేశ్వరరావును నోడల్ అధికారిగా నియమించిన్నట్లు తెలిపారు. తొలి దశలో గుర్తిస్తే చికిత్సను అందించవచ్చన్నారు. వ్యాధి నివారణకు టామీ ఫ్లూ మాత్రలను రోజుకు 75 గ్రాముల చొప్పున పది రోజులపాటూ వాడితే తగ్గుతుందన్నారు. పందుల నుంచి ఈ వ్యాధి సోకుతుందన్నారు. ప్రభుత్వం నుంచి 300 మాత్రలు సోమవారానికి నగరానికి చేరుతాయన్నారు, మరో 100 మాత్రలను విజయవాడ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేసిందన్నారు. ఈ మాత్రలను మృతునికి దగ్గరగా ఉన్న వారికి, నగరంలోని ప్రయివేటు వైద్యశాలలో చికిత్స చేసిన వారికి అందించిన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎపిడమాలజిస్టు పుల్లారెడ్డి పాల్గొన్నారు. పది రోజులపాటు వైద్య శిబిరం అద్దంకి: గ్రామంలో పది రోజులపాటు వైద్య శిభిరాలు కొనసాగిస్తామని క్లస్టర్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో టి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎక్కడ జ్వరాలున్నా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏల్చూరులో స్వైన్‌ప్లూ నివారణ చర్యలు సంతమాగులూరు; స్వైన్‌ప్లూ వ్యాధి నివారణ చర్యలు ఏల్చూరు చేపట్టారు. ఒంగోలులోని ప్రవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన వ్యక్తికి స్వైన్‌ప్లూ ఉన్నట్టు నిర్ధారణ కావండంతో స్థానిక వైద్యధికారి జయకుమార్ శనివారం గ్రామాన్ని సందర్శించి అపరిశుభ్ర ప్రదేశాలలో నివాసముండే వారికి మాస్క్‌లు, ముందస్తు మందులు పంపిణీ చేశారు. మృతుడు రెండు నెలలుగా ఏల్చూరులోని క్రషర్ మిల్లులో పనిచేస్తూ 11రోజుల క్రితం స్వగ్రామం వెళ్లివస్తానని తిరిగి ప్యాక్టరీకి రాలేదు. అప్పటి నుంచే అనారోగ్యానకి గురై ఒంగోలు ప్రయివేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో వైద్య శాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. 2012 అక్టోబర్ నెలలో కూడా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా అప్పట్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.


