రంగంలోకి వైద్య సిబ్బంది | Medical Staff Swine Flu in Ongole | Sakshi
Sakshi News home page

రంగంలోకి వైద్య సిబ్బంది

Jan 11 2015 4:22 AM | Updated on Oct 9 2018 7:52 PM

స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మరణించడంతో ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందిని అప్రమత్తం

 ఒంగోలు సెంట్రల్ : స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మరణించడంతో ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ టి.రమేష్ తెలిపారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ హాలులో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యన మాట్లాడుతూ అద్దంకి క్లస్టర్ పరిధిలోని జె.పంగులూరు మండలం, జాగర్లమూడి వారిపాలేనికి చెందిన జి.బాలు అలియాస్ (27) శివకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే పూనేలోని వైరాలజీ ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే స్వైన్ ప్లూగా నిర్థారించాల్సి ఉందన్నారు. 240 గృహాలను సంధర్శించి ప్రజలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.   వ్యాధిగ్రస్తులు  తుమ్మినా, దగ్గినా, తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నారు.  అలాంటి వారికి దగ్గరగా ఉన్నా,
 
 కరచాలనం చేసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందన్నారు. రిమ్స్ అత్యవసర చికిత్స వార్డులో ఆరు బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసిన్నట్లు, వెంటిలేటర్లను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ వై. రాజేశ్వరరావును నోడల్ అధికారిగా నియమించిన్నట్లు తెలిపారు.  తొలి దశలో గుర్తిస్తే చికిత్సను అందించవచ్చన్నారు. వ్యాధి నివారణకు టామీ ఫ్లూ మాత్రలను రోజుకు 75 గ్రాముల చొప్పున పది రోజులపాటూ వాడితే తగ్గుతుందన్నారు. పందుల నుంచి ఈ వ్యాధి సోకుతుందన్నారు. ప్రభుత్వం నుంచి 300 మాత్రలు సోమవారానికి నగరానికి చేరుతాయన్నారు, మరో 100 మాత్రలను విజయవాడ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేసిందన్నారు. ఈ మాత్రలను మృతునికి దగ్గరగా ఉన్న వారికి, నగరంలోని ప్రయివేటు వైద్యశాలలో చికిత్స చేసిన వారికి అందించిన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎపిడమాలజిస్టు పుల్లారెడ్డి పాల్గొన్నారు.
 
 పది రోజులపాటు వైద్య శిబిరం
 అద్దంకి: గ్రామంలో పది రోజులపాటు వైద్య శిభిరాలు కొనసాగిస్తామని క్లస్టర్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో టి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎక్కడ జ్వరాలున్నా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు.
 
 ఏల్చూరులో స్వైన్‌ప్లూ నివారణ చర్యలు
 సంతమాగులూరు; స్వైన్‌ప్లూ వ్యాధి నివారణ చర్యలు ఏల్చూరు చేపట్టారు. ఒంగోలులోని ప్రవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన వ్యక్తికి స్వైన్‌ప్లూ ఉన్నట్టు నిర్ధారణ కావండంతో స్థానిక వైద్యధికారి జయకుమార్ శనివారం గ్రామాన్ని సందర్శించి అపరిశుభ్ర ప్రదేశాలలో నివాసముండే వారికి మాస్క్‌లు, ముందస్తు మందులు పంపిణీ చేశారు. మృతుడు రెండు నెలలుగా ఏల్చూరులోని క్రషర్ మిల్లులో పనిచేస్తూ 11రోజుల క్రితం స్వగ్రామం వెళ్లివస్తానని తిరిగి ప్యాక్టరీకి రాలేదు. అప్పటి నుంచే అనారోగ్యానకి గురై ఒంగోలు ప్రయివేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో వైద్య శాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. 2012 అక్టోబర్ నెలలో కూడా ఇదే గ్రామానికి  చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా అప్పట్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement