Kate Middleton Cute Reply to a Little School Girl about Photo-shoot - Sakshi
Sakshi News home page

వీళ్లంతా మీ ఫొటో తీస్తున్నారేందుకు..?!

Oct 4 2018 1:18 PM | Updated on Nov 9 2018 5:06 PM

Kate  Middleton Said To A Child They Are Picturing You Because You Are Special - Sakshi

లండన్‌ : అప్పుడప్పుడు చిన్న పిల్లలు అడిగే అమాయకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. ఇదే పరిస్థితి బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్‌టన్‌కి ఎదురయ్యింది. కానీ ఆమె చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. ఈమధ్యే ప్రసూతి సెలవులు ముగించుకున్న కేట్‌ మిడిల్‌టన్‌ వెస్ట్‌ లండన్‌లో సయేర్స్‌ క్రాఫ్ట్స్‌ ఫారెస్ట్‌ స్కూల్‌ని, వైల్డ్‌ లైఫ్‌ గార్డెన్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు కేట్‌ని ఫొటో తీయడానికి పోటీ పడ్డారు.

ఈ హడావుడి చూసిన పిల్లలకు ‘ఏంటి ఈమె ప్రత్యేకత.. అందరు ఎందుకు ఈమెని ఫొటో తీయడానికి ఇంతలా పోటీ పడుతున్నారు’ అనే అనుమానం మొదలయ్యింది. సందేహం అయితే వచ్చింది కానీ ఎవరూ దాన్ని బయటపెట్ట లేదు. కానీ ఓ చిన్నారి మాత్రం ధైర్యంగా ‘వీళ్లంతా ఎందుకు మిమ్మల్ని ఫోటో తీస్తున్నారు’ అని కేట్‌ని అడిగింది. అందుకు యువరాణి నవ్వుతూ ‘వారంతా నన్ను ఫొటో తీయడం లేదు.. నిన్ను ఫొటో తీస్తున్నారు. ఎందుకంటే నువ్వు చాలా ప్రత్యేకం కదా’ అంటూ సమాధానం చెప్పారు.

కేట్‌ చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక అక్కడున్న వారిని కూడా సంతోషపెట్టింది. కేట్‌ సమాధానం విన్న నెటిజన్లు ‘ఎంతైనా ముగ్గురు పిల్లలకు తల్లి కదా..! పిల్లలతో ఎలా ప్రవర్తించాలో బాగానే తెలిసి ఉంటుందం’టూ ప్రశంసిస్తున్నారు. అంతేకాక ‘అవును మరి అంత చిన్న బుర్రకు కేట్‌ యువరాణి అని.. అందుకే ఫొటో తీస్తున్నారంటే ఎలా అర్థమవుతుంది.. అర్థమవ్వకపోగా మరిన్ని సందేహాలు తలెత్తే అవకాశం ఉందం’టూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement