పీజీ పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యం | Irresponsibility in conducting PG exams: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పీజీ పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యం

Nov 22 2025 5:09 AM | Updated on Nov 22 2025 5:09 AM

Irresponsibility in conducting PG exams: Andhra Pradesh

ఏఎన్‌యూ పీజీ ప్రశ్నాపత్రంలో మూడుచోట్ల ఒకే ప్రశ్న

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగారు­్జన యూనివర్సిటీ(ఏఎన్‌యూ) పీజీ ప­రీక్షల నిర్వహణలో అధికారుల బాధ్యతారా­హిత్యం మరోసారి బట్టబయలైంది. వి­ద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి­న పరీక్షల నిర్వహణలో వరుసగా లోపా­లు త­లెత్తుతున్నా వాటిని సరిదిద్ది పక­డ్బందీగా నిర్వహించడంపై సంబంధిత అధికారులు కనీసం దృష్టి సారించడం లేదనేది శుక్రవారం జరిగిన ఘటనతో స్పష్టమవుతోంది.

ప్రశ్నాపత్రంలో ఒకే ప్రశ్న మూ­డుచోట్ల ఇవ్వడంతో విద్యా­ర్థులు అయోమయానికి గుర­య్యారు. తర్జ­నభర్జనల తరువాత గంట ఆలస్యంగా మరో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలు రాయించారు. శుక్ర­వా­రం ఎం.కామ్‌ మూడో సెమిస్టర్‌ కామర్స్‌ పేపర్‌­లో ఒకే ప్రశ్నను 2బీ, 3ఏ, 4ఏగా ఇచ్చా­రు. దీన్ని చూసి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. సమస్యను ఇని్వజిలేటర్‌కు వివరించారు. ప్రశ్నాపత్రాన్ని పరిశీలించిన ఇని్వజిలేటర్‌ జరిగిన త­ప్పి­దా­న్ని పీజీ కో–ఆర్డినేటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో గంట ఆలస్యంగా మరో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్ష రాయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement