నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు | Jaycee Chan blames father jackie chan for jail | Sakshi
Sakshi News home page

నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు

Jan 13 2015 3:58 PM | Updated on May 25 2018 2:11 PM

నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు - Sakshi

నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు

మాదకద్రవ్యాల కేసులో అరెస్టై జైలుపాలైన జేసీ చాన్.. తన తండ్రి జాకీ చాన్ పై ఆరోపణలు గుప్పించాడు.

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టై జైలుపాలైన జెసీ చాన్.. తన తండ్రి జాకీచాన్ పై  పలు ఆరోపణలు గుప్పించాడు. తాను జైలుకు వెళ్లడానికి తండ్రే ప్రధాన కారణమని ఆరోపించాడు. తనకు మార్గదర్శిగా నిలవాల్సిన తండ్రి తనను పూర్తిగా విస్మరించాడన్నారు. తను మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైనందుకు సిగ్గుపడుతున్నానని తల్లి జాన్ లిన్ కు రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశాడు. జాకీచాన్ పై కుమారుడు ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం.

 

ఈ సందర్భంగా జేసీ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టడం వల్ల తను ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాన్నారు. తన తండ్రి ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపేవారని, తనను ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సంఘటనలతో సహజంగానే తను తల్లికి దగ్గరయ్యానన్నారు.  జేసీ జైలు పాలై ఐదు నెలలైనా ఇప్పటివరకూ తల్లిదండ్రులిద్దరూ చూడటానికి రాలేదని ఆరోపించారు. తల్లిని చూడగానే జేసీ చాన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement