పోలీసుల కాల్పుల్లో 132 మంది డ్రగ్స్ డీలర్లు మృతి
రియో: బ్రెజిల్‌లో అక్రమ మాదక ద్రవ్యాల ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రియో డి జెనీరో సిటీలో మంగళవారం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఎదురు తిరిగిన డ్రగ్స్ డీలర్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం 132 మంది మరణించడం గమనార్హం. ఈ దాడుల్లో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్నట్లు రియో డి జెనీరో స్టేట్ గవర్నర్ క్లాడియో క్యాస్ట్రో చెప్పారు. నగరంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ అని స్పష్టంచేశారు. దాడుల్లో 42 తుపాకులు సైతం లభ్యమైనట్లు అధికారులు వెలలడించారు.
రియో సిటీలో వచ్చేవారం సీ40 ప్రపంచ మేయర్ల సదస్సు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ముఠాల భరతం పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మాదక ద్రవ్యాలు నిల్వ చేసినట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. వేలాది మంది పోలీసులు, సైనికులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దాడుల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలను అడ్డుకొనేందుకు డ్రగ్స్ డీలర్లు, అమ్మకందార్లు ప్రయతి్నంచారు. వారు డ్రోన్లతో ఎదురు దాడులు చేసేందుకు ప్రయతి్నంచారు. చివరకు పోలీసులు వారి ఆట కట్టించారు. 81 మందిని అరెస్టు చేశారు.


