breaking news
kill charges
-
బ్రెజిల్లో డ్రగ్స్ ముఠాలపై దాడులు
రియో: బ్రెజిల్లో అక్రమ మాదక ద్రవ్యాల ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రియో డి జెనీరో సిటీలో మంగళవారం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఎదురు తిరిగిన డ్రగ్స్ డీలర్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం 132 మంది మరణించడం గమనార్హం. ఈ దాడుల్లో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్నట్లు రియో డి జెనీరో స్టేట్ గవర్నర్ క్లాడియో క్యాస్ట్రో చెప్పారు. నగరంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ అని స్పష్టంచేశారు. దాడుల్లో 42 తుపాకులు సైతం లభ్యమైనట్లు అధికారులు వెలలడించారు. రియో సిటీలో వచ్చేవారం సీ40 ప్రపంచ మేయర్ల సదస్సు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ముఠాల భరతం పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మాదక ద్రవ్యాలు నిల్వ చేసినట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. వేలాది మంది పోలీసులు, సైనికులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దాడుల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలను అడ్డుకొనేందుకు డ్రగ్స్ డీలర్లు, అమ్మకందార్లు ప్రయతి్నంచారు. వారు డ్రోన్లతో ఎదురు దాడులు చేసేందుకు ప్రయతి్నంచారు. చివరకు పోలీసులు వారి ఆట కట్టించారు. 81 మందిని అరెస్టు చేశారు. -
ఏడుపు ఆపలేదని చెల్లిని కొట్టి చంపాడు
బర్మింగ్‌హామ్: ఓతల్లి నిర్లక్ష్యం.. పరిపక్వత లేని బాలుడి చేసిన పని ఓ ఏడాది చిన్నారి ప్రాణాలు తీసింది. పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేసి పసిపాపను ఎనిమిదేళ్ల కుమారుడికి అప్పగించి బాధ్యతారహితంగా నైట్ క్లబ్‌కు వెళ్లిన ఆ తల్లి దుర్వార్త వినాల్సి వచ్చింది. బర్మింగ్ హామ్ లోని ఓ తల్లి తన ఎనిమిదేళ్ల కుమారుడికి ఏడాది కూతురును అప్పగించి నైట్ క్లబ్ కి వెళ్లింది. అయితే, ఏడుపు మొదలుపెట్టిన పాప అదే పనిగా ఏడుస్తూ ఉండిపోయింది. పాపను ఓదార్చేందుకు ప్రయత్నించి బాలుడు చివరికి కోపానికి లోనై ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆ పాప చనిపోయింది. ఈ ఘటనపట్ల అక్కడి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంలోనే ఇలాంటి ఘటన చూడలేదని, తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసి వెళతారో అర్థం కావడం లేదని అన్నారు. ఇది ఏమాత్రం గర్హించదగిన విషయంకాదని, అంగీకరించకూడని విషయమని మండిపడ్డారు. పాపను చంపేసిన బాలుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. పాప తల్లి కాటెర్రా లెవిస్ పై కూడా కేసు పెట్టారు. ఈ ఘటనకు పాల్పడిన బాలుడు ప్రస్తుతం అలబామాలోని చైల్డ్ వెల్ఫేర్ ఎజెన్సీలో ఉన్నాడని, నేరం విషయంలో ప్రత్యేకమైన వయసు అని నిబంధన ఏదీ అలబామాలో లేదని, ఫ్యామిలీ కోర్టు నిబంధనల ప్రకారమే అతడిని విచారిస్తామని పోలీసులు తెలిపారు.


