ఏడుపు ఆపలేదని చెల్లిని కొట్టి చంపాడు

ఏడుపు ఆపలేదని చెల్లిని కొట్టి చంపాడు


బర్మింగ్హామ్: ఓతల్లి నిర్లక్ష్యం.. పరిపక్వత లేని బాలుడి చేసిన పని ఓ ఏడాది చిన్నారి ప్రాణాలు తీసింది. పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేసి పసిపాపను ఎనిమిదేళ్ల కుమారుడికి అప్పగించి బాధ్యతారహితంగా నైట్ క్లబ్కు వెళ్లిన ఆ తల్లి దుర్వార్త వినాల్సి వచ్చింది. బర్మింగ్ హామ్ లోని ఓ తల్లి తన ఎనిమిదేళ్ల కుమారుడికి ఏడాది కూతురును అప్పగించి నైట్ క్లబ్ కి వెళ్లింది. అయితే, ఏడుపు మొదలుపెట్టిన పాప అదే పనిగా ఏడుస్తూ ఉండిపోయింది. పాపను ఓదార్చేందుకు ప్రయత్నించి బాలుడు చివరికి కోపానికి లోనై ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆ పాప చనిపోయింది. ఈ ఘటనపట్ల అక్కడి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



తమ జీవితంలోనే ఇలాంటి ఘటన చూడలేదని, తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసి వెళతారో అర్థం కావడం లేదని అన్నారు. ఇది ఏమాత్రం గర్హించదగిన విషయంకాదని, అంగీకరించకూడని విషయమని మండిపడ్డారు. పాపను చంపేసిన బాలుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. పాప తల్లి కాటెర్రా లెవిస్ పై కూడా కేసు పెట్టారు. ఈ ఘటనకు పాల్పడిన బాలుడు ప్రస్తుతం అలబామాలోని చైల్డ్ వెల్ఫేర్ ఎజెన్సీలో ఉన్నాడని, నేరం విషయంలో ప్రత్యేకమైన వయసు అని నిబంధన ఏదీ అలబామాలో లేదని, ఫ్యామిలీ కోర్టు నిబంధనల ప్రకారమే అతడిని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top