ఇవాంచోకే అవకాశం! | Jackie Evancho to sing national anthem at Donald Trump's | Sakshi
Sakshi News home page

ఇవాంచోకే అవకాశం!

Dec 15 2016 10:29 PM | Updated on Aug 25 2018 7:50 PM

ఇవాంచోకే అవకాశం! - Sakshi

ఇవాంచోకే అవకాశం!

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో జాతీయ గీతం పాడేందుకు జాకీ ఇవాంచోకే అవకాశం దక్కింది.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో జాతీయ గీతం పాడేందుకు జాకీ ఇవాంచోకే అవకాశం దక్కింది. ఈ పదహారేళ్ల టీనేజ్‌ క్లాసికల్‌ సింగర్‌ అమెరికన్లకు కొత్తేం కాదు. గతంలో ఒబామా పాల్గొన్న పలు కార్యక్రమాల్లో జాతీయగీతం పాడింది ఇవాంచోనే. అధ్యక్షుడు మారినా ఆ అవకాశం మాత్రం మళ్లీ ఇవాంచోకే దక్కింది. 2010లో క్రిస్మస్‌ వేడుకలలో ప్రదర్శణ ద్వారా ఇవాంచో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన చాలా ఈవెంట్లలో ఆమె పాటలు పాడి దేశ ప్రజల ప్రశంసలు పొందింది.

ఈ ఏడాది ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్లలో ‘ గాడ్‌ బ్లెస్‌ అమెరికా’  ని ఆలపించింది. 10 ఏళ్ల వయసులో యూట్యూబ్‌ సంచలనంగా మారిన ఇవాంచో ‘ అమెరికా గాట్‌ టాలెంట్‌’  గా ఎంపికైంది. అప్పటినుంచీ అమెరికా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె ఎంపికపై మాట్లాడుతూ.. ‘  నాకు ఈ అవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలో ఒబామా ప్రభుత్వంలో ఈవెంట్స్‌ చేశాను. ఇప్పుడు ట్రంప్‌ సమక్షంలో ప్రదర్శన ఇవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’  అని టీనేజ్‌ సింగర్‌ జాకీ ఇవాంచో చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement