ఇరాన్‌లో భూకంపం: ఐదుగురు మృతి

Iran Earthquake: Five Killed, 120 Injured - Sakshi

తెహ్రాన్‌ : ఇరాన్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 120 మంది గాయాలపాలయ్యారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైంది. అజర్‌బైజాన్‌ పరిధిలోని తాబ్రిజ్‌ నగరం నుంచి సుమారు120 కిలోమీటర్ల (75 మైళ్లు)మేర భూమి కంపించినట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి. భూమి నుంచి 5 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే విపత్తును ముందుగానే అంచనా వేసింది. భూకంపం రాబోతుందని, ప్రాణనష్టం సంభవించే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్‌ ఎన్నో విపత్తులను ఎదుర్కుంటోంది. 2003లో వచ్చిన భూకంపం దాదాపు 31,000 మందిని పొట్టనపెట్టుకుంది. 1990లో 7.4గా నమోదైన భూకంపం దాదాపు 40,000మందిని బలి తీసుకోగా మూడు లక్షలమంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 5000 మంది నిరాశ్రయులయ్యారు. 2005, 2012లో వచ్చిన భూకంపాల్లో వరుసగా600మంది ,300 మంది చనిపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top