ఇరాన్‌పై అమెరికా అసహనం

Iran Aggressively Destabilising Middle East - Sakshi

వాషింగ్టన్‌ : ఇరాన్‌ పాలన, విధానాలపై అమెరికా మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఇరాన్‌ అవలంభించే దూకుడు విధానాలు మధ్య ప్రాచ్య దేశాల్లో అస్థిరత సృష్టించేలా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా పాలసీ ప్లానింగ్‌ అధికారి బ్రెయిన్‌ హుక్‌.. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఇరాన్‌ విధానాల వల్ల మధ్య ప్రాచ్య దేశాల్లో శాంతి, భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ ఒప్పందం(చైనా, ఫ్రాన్స్‌, రష్యా, యూకే, అమెరికా, జర్మనీ, ఈయూల మధ్య ఉన్న అణు ఒప్పందం)లోని అన్ని నియమాలను తాము పాటిస్తున్నామని, అదే విధంగా ఇరాన్‌ కూడా జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అన్యాయంగా అదుపులోకి తీసుకున్న అమెరికా పౌరులను ఇరాన్‌ విడుదల చేయాలని, అందుకు అవసరమైర చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు.

మాకు దేశ భద్రతే ముఖ్యం...
విమానయాన లైసెన్సులకు సంబంధించి ఇరానీయులపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని విలేకరులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా హుక్‌ చెప్పారు. ‘మధ్య ప్రాచ్య దేశాల్లో తీవ్రవాదులు, ఆయుధాల కోసం ఇరాన్‌ వారి ఎయిర్‌లైన్స్‌ను ఉపయోగించుకోవచ్చు అంతేకానీ మా దేశ భద్రతను పణంగా పెట్టి వారికి లైసెన్సులు మాత్రం జారీ చేయలేము’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ పౌర విమానయాన విధానాల్లో సంస్కరణల కోసం, ఆర్థికంగా బలపడటానికి తమ వంతు సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాల గురించి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా పార్లమెంట్‌లో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారని హుక్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top