
యునెస్కో జాబితాలోకి ‘అగస్త్యమాల’
భారత్‌లోని విశిష్టమైన అగస్త్యమాల జీవావరణ రిజర్వుకు అరుదైన ఘనత దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన అత్యున్నత సాంస్కృతిక విభాగమైన యునెస్కో
న్యూయార్క్: భారత్‌లోని విశిష్టమైన అగస్త్యమాల జీవావరణ రిజర్వుకు అరుదైన ఘనత దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన అత్యున్నత సాంస్కృతిక విభాగమైన యునెస్కో తాజాగా ప్రపంచవ్యాప్తంగా 20 జీవావరణ రిజర్వులను ‘వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్’ జాబితాలోకి చేర్చింది.
పెరూ రాజధాని లిమాలో జరిగిన అంతర్జాతీయ సమన్వయ మండలి భేటీలో కొత్త ప్రాంతాల చేరికపై నిర్ణయం తీసుకున్నారు. 120 దేశాల్లోని 669 జీవావరణ రిజర్వు జాబితాలో ఉన్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో ఉన్న అగస్త్యమాలలో 2,254 ఎత్తై జాతి రకానికి చెందిన మొక్కలుండగా, 400 విశిష్ట లక్షణాలున్న మొక్కలున్నట్లు యునెస్కో తెలిపింది. అక్కడ యాలకులు, జాజికాయ, మిరియాలు తదితర పంటలు సాగవుతాయి.