breaking news
Biosphere Reserve
-
నాన్నగారి కొలను..!
చార్టర్డ్ ఎకౌంటెంట్ వికాస్ కుమార్ తన బాల్యజ్ఞాపకాల్లోకి వెళ్లినప్పుడల్లా కొంగల రెక్కల చప్పుడుతో ఊరి చెరువు ప్రత్యక్షమయ్యేది. ఆ చెరువులో తాను ఎన్నో సార్లు ఈత కొట్టాడు. అలాంటి అద్భుతమైన అనుభవం ఈతరం పిల్లలకు దూరం కావడం అతడికి బాధగా ఉండేది. ఆ బాధలో నుంచి పుట్టిందే... ఎకో ఫ్రెండ్లీ కొలను! కోయంబత్తూరులో ఉంటున్న వికాస్ సమీపంలోని చెరువుల్లో తన పిల్లాడికి ఈత నేర్పించాలనుకున్నాడు. అయితే మురికి, రసాయనాలతో కూడిన చెరువులు అతడిని భయపెట్టాయి. అలా అని ఆయన ఊరకే ఉండిపోలేదు. పాల్లాచ్చిలోని తన స్వంత వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్–క్లీనింగ్ పాండ్‌ను నిర్మించాడు. దీనికి ముందు యూరప్‌లో ప్రసిద్ధి పొందిన ఎకో–ఫ్రెండ్లీ బయో స్విమ్ పాండ్స్ గురించి అధ్యయనం చేశాడు. తన వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్–క్లీనింగ్ పాండ్‌ను నిర్మించడానికి మాత్రమే పరిమితం కాలేదు వికాస్. మన దేశ వాతావరణం, జీవనశైలికి అనుగుణంగా బయో స్విమ్మింగ్ కొలనులను నిర్మించడానికి ‘బయోస్పియర్’ అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ సహజసిద్ధమైన జలపాతాలు, కొలనులకు రూపకల్పన చేస్తోంది. ‘మాకు మీలాంటి కొలను ఒకటి కావాలి’ అని తమ పిల్లలతో తల్లిదండ్రులు వచ్చినప్పుడు వికాస్‌కు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ సంతోషం తన కంపెనీకి వచ్చే లాభాల గురించి కాదు. పర్యావరణ హిత, రసాయన రహిత కొలనుల గురించి వారు ఆలోచన చేస్తున్నందుకు! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..) -
యునెస్కో జాబితాలోకి ‘అగస్త్యమాల’
న్యూయార్క్: భారత్‌లోని విశిష్టమైన అగస్త్యమాల జీవావరణ రిజర్వుకు అరుదైన ఘనత దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన అత్యున్నత సాంస్కృతిక విభాగమైన యునెస్కో తాజాగా ప్రపంచవ్యాప్తంగా 20 జీవావరణ రిజర్వులను ‘వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్’ జాబితాలోకి చేర్చింది. పెరూ రాజధాని లిమాలో జరిగిన అంతర్జాతీయ సమన్వయ మండలి భేటీలో కొత్త ప్రాంతాల చేరికపై నిర్ణయం తీసుకున్నారు. 120 దేశాల్లోని 669 జీవావరణ రిజర్వు జాబితాలో ఉన్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో ఉన్న అగస్త్యమాలలో 2,254 ఎత్తై జాతి రకానికి చెందిన మొక్కలుండగా, 400 విశిష్ట లక్షణాలున్న మొక్కలున్నట్లు యునెస్కో తెలిపింది. అక్కడ యాలకులు, జాజికాయ, మిరియాలు తదితర పంటలు సాగవుతాయి.