మనోళ్లే పనిమంతులు | Sakshi
Sakshi News home page

మనోళ్లే పనిమంతులు

Published Mon, Jun 29 2015 12:02 PM

మనోళ్లే పనిమంతులు

న్యూఢిల్లీ: నిర్ణీత పనిగంటల కంటే ఎక్కువ సేపు పనిచేసే వారిలో భారతీయ ఉద్యోగులు ముందుంటారని ఇటీవల ‘డేల్ కార్నెజీ’ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. 61 శాతం మంది అదనంగా చేసిన సమయానికి జీతాన్ని ఆశించడంలేదని తెలిపింది. 46 శాతం భారతీయులు ఇచ్చిన పనిని పూర్తి నిబద్ధతతో పూర్తిచేస్తారనీ, ఈ విషయంలో ప్రపంచ దేశాల సగటు 30 శాతమేనని తేల్చింది. 58 శాతం మంది భారతీయ ఉద్యోగులు తాము అనుకున్న పనిని కచ్చితంగా పూర్తి చేస్తున్నారనీ, కంపెనీ లక్ష్యాలు అందుకుంటున్నారనీ తెలిపింది.

ఇండియాలోని పెద్ద కంపెనీలు నిపుణులైన ఉద్యోగులను నియమించుకోడానికే మొగ్గు చూపుతున్నాయని పేర్కొంది. నైపుణ్యం ఉన్న 71 శాతం మంది ఉద్యోగులు రూ.కోట్లలో జీతాలు అందుకుంటున్నారని తెలిపింది. భారత జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, డేల్ కార్నెజీ సంయుక్తంగా 2014 సర్వే నిర్వహించాయి. 1,200 మంది ఉన్నతోద్యోగులను సంప్రదించి ఈ వివరాలు వెల్లడించింది.

Advertisement
Advertisement