భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు | Indian origin CEO abused by Donald Trump supporter in US | Sakshi
Sakshi News home page

భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు

Aug 23 2017 3:53 PM | Updated on Aug 25 2018 7:52 PM

భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు - Sakshi

భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు

అగ్రదేశం అమెరికాలో భారత సంతతి సీఈవో జాత్యహంకార వేధింపులకు గరయ్యాడు.

సాక్షి, న్యూఢిల్లీ: అగ్రదేశం అమెరికాలో భారత సంతతి సీఈవో జాత్యహంకార వేధింపులకు గురయ్యాడు.  జీఎంఎం నాన్‌స్టిక్‌ సీఈవో గా పనిచేస్తు‍న్న రావిన్‌గాంధీ ఇటీవల జాత్యంహకార వేధింపులను ఎదుర్కొన్నాడు. చార్లోట్టెస్ విల్లెలో తనపై జరిగిన వేధింపుల అనంతరం రావిన్‌ గాంధీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఎజెండాపై సీఎన్‌బీసీకి ఒక ఆర్టికల్‌ రాశారు.

ఈ-మెయిల్ మరియు ట్విట్టర్‌లో ట్రంప్‌ అభిమానులు తనను తీవ్రంగా దూషించినట్లు రవీన్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్‌ మద్దతుదారురాలైన ఒక మహిళ తనను అసభ్యకరంగా భారతీయ పంది అంటూ తిడుతున్న ఆడియో టేపును రావిన్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. అంతేకాకుండ ఆ ఆడియో టేపులో 'మీ చెత్తను తీసుకొని ఇండియాకు వెళ్లి అమ్ముకోండి' అంటూ దూషించింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో అమెరకా సంయుక్త రాష్ట్రాల రాయబారి నిక్కీ హలేను "బంగ్లాదేశ్ క్రీప్" అంటూ విమర్శించింది.

అయితే తన రోజువారి జీవితంలో ఇది పెద్ద సమస్యకాదన్నారు. కానీ దురదృష్టవశాత్తూ అమెరికాలో తనను రెండవ తరగతి పౌరుడిగా భావిస్తున్నారంటూ రావిన్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement