భారత సంతతి వ్యాపారి కాల్చివేత | Indian origin businessman shot dead by robbers | Sakshi
Sakshi News home page

భారత సంతతి వ్యాపారి కాల్చివేత

Nov 3 2014 1:11 AM | Updated on Sep 2 2017 3:46 PM

భారత సంతతికి చెందిన ప్రగ్రేత్ సింగ్ (35) అనే వ్యాపారి యూకేలోని మాంచెస్టర్‌లో దోపిడీదారుల చేతిలో రెండురోజుల కిందట కాల్చివేతకు గురయ్యారు.

లండన్: భారత సంతతికి చెందిన ప్రగ్రేత్ సింగ్ (35) అనే వ్యాపారి యూకేలోని మాంచెస్టర్‌లో దోపిడీదారుల చేతిలో రెండురోజుల కిందట కాల్చివేతకు గురయ్యారు.స్థానిక పోలీసుల కథనం మేరకు సింగ్ తన దుకాణాన్ని మూసివేస్తున్న సమయంలో దుండగులు అతనిపై దాడికి తెగబడ్డారు. వారిని నిరోధించే క్రమంలో నిందితులు అతడ్ని దగ్గరనుంచి కాల్పులు జరపడంతో ఆయన కుప్పకూలాడు. అనంతరం ఆసుపత్రిలో ఆయన ప్రాణాలు విడిచాడు.

 

ఈ సందర్భంగా దోపిడీదారులు భారీ ఎత్తున నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. సన్నిహితులకు చార్లేగా సుపరిచితుడైన సింగ్‌కు భార్యసుఖవిందర్, రెండు, అయిదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement