భారతీయ టెకీ మృతి

Indian engineer in US Green Card backlog dies - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ఒకరు మంగళవారం అకస్మాత్తుగా చనిపోయాడు. నార్త్‌ కరొలినాలో నివసించే శివ చలపతి రాజు ఆరకిల్‌ సంస్థలో డెవలపర్‌గా ఉన్నారు. అంతకుముందు, ఆయన విప్రో, బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థల్లో పనిచేశారు. రాజు మృతికి కారణాలు తెలియరాలేదు. ఆయన గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. గ్రీన్‌కార్డ్‌ లేకపోవడం వల్ల రాజు భార్య బాబీ సౌజన్య భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజు మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు మిత్రులు పీడ్‌మాంట్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని అమెరికన్‌ బజార్‌ పత్రిక పేర్కొంది. కాగా శివ చలపతి రాజు రాజమండ్రిలో చదువుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top