‘ఇండో-అమెరికన్‌ ఓట్లే కీలకం’

Indian American Voters as Key to White House Said Joe Biden - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి భారతీయ అమెరికన్ల ఓటర్లు ఎంతో ముఖ్యమని డెమొక్రాట్లు నమ్ముతున్నారు. గతంలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌లు డెమొక్రాట్లకు ఎక్కువగా ఓట్లు వేశారు. అలాగే ఈ సారి నవంబర్‌ 3న, జరిగే ఎన్నికల్లో వారు కీలక పాత్ర పోషిస్తారని, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి మార్గం సుగమం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ చైర్మన్‌ టామ్‌ పెరెజ్‌ ఇటీవల ఒక వర్చువల్ టన్-హాల్‌లో మాట్లాడుతూ, భారతీయ అమెరికన్‌ ఓట్లు కచ్ఛితంగా ఫలితాలలో వ్యత్యాసాన్ని తీసుకురాగలవని చెప్పారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ మిచిగాన్, విస్కాన్సిన్ , పెన్సిల్వేనియా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్‌కు తక్కువ మెజారిటీ లభించింది.   ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు, భారతీయ, చైనీస్, ఫిలిపినో, కొరియన్, జపనీస్  ఇండోనేషియా సంతతివారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు.

చదవండి: నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్‌ శంకర్‌!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాలను వరుసగా 0.2, 0.7, 0.8 శాతం పాయింట్లతో స్వల్ప మెజారిటీతో గెలుచుకున్నారు.   జనభా పరంగా ఎక్కువ ఓట్లను హిల్లరీ క్లింటన్‌ సొంత చేసుకున్నప్పటికీ అమెరికాలో అధ్యక్షుడని నిర్ణయించేవి ఎలక్టోరల్‌ ఓట్లు. అమెరికాలో 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా ట్రంప్‌కు 304 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా, క్లింటన్‌కు 227 ఓట్లు వచ్చాయి.  

మిచిగాన్‌లో 125,000 మంది భారతీయ అమెరికన్ ఓటర్లు, పెన్సిల్వేనియాలో 156,000,  విస్కాన్సిన్‌లో 37,000 మంది ఉన్నారు.  యూనిటెడ్‌ స్టేట్స్‌లో 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్‌ ఓటర్లు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది ఓటు వేయడానికి అర్హులు. ట్రంప్‌ను నిలువరించి బిడెన్‌ను గెలిపించడంలో ఈ ఓటర్ల కీలక పాత్ర పోషిస్తారని  డెమొక్రాటిక్ గ్రూప్ ఏఏపీఐ విక్టరీ ఫండ్ విశ్లేషించింది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో గెలవడానికి అమెరికన్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. 

చదవండి: చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top