నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి | Indian-American selected by NASA among 12 new astronauts | Sakshi
Sakshi News home page

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి

Jun 9 2017 1:25 AM | Updated on Sep 5 2017 1:07 PM

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగా నికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్‌ సంతతికి చెందిన యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు.

హూస్టన్‌:  నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగా నికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్‌ సంతతికి చెందిన యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు. ఎర్త్‌ ఆర్బిట్‌ అండ్‌ డీప్‌ స్పేస్‌ మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది.

ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ, అమెరికాలోని నావెల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తు తం ఆయన 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఉన్న ఎఫ్‌–35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement