భారత్ నా రెండవ పుట్టినిల్లు: ఆంగ్‌సాన్ సూకీ | India is my second home : Suu Kyi | Sakshi
Sakshi News home page

భారత్ నా రెండవ పుట్టినిల్లు: ఆంగ్‌సాన్ సూకీ

Nov 12 2014 9:36 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఆంగ్‌సాన్ సూకీ - నరేంద్ర మోదీ - Sakshi

ఆంగ్‌సాన్ సూకీ - నరేంద్ర మోదీ

మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడ తొలిసారి సమావేశమయ్యారు.

 నేపితా: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త, ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆంగ్‌సాన్ సూకీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడ తొలిసారి సమావేశమయ్యారు. భారత్-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొనే సందర్భంగా మోదీ ఆమెతో సమావేశమయ్యారు.  భారత్ తనకు రెండో పుట్టిల్లు అంటూ ఈ భేటీలో మోదీకి సూకీ చెప్పినట్లు భారత విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ 'ట్వీట్' చేశారు.

భారత్‌లో మయన్మార్ రాయబారిగా పనిచేసిన తన తల్లి దాఖిన్ యీ తో కలసి సూకీ తన చిన్నతనంలో భారత్‌లో నివసించడం తెలిసిందే. ఆమె ఢిల్లీ, సిమ్లాలలో చదువుకున్నారు.
**

Advertisement
 
Advertisement
Advertisement