సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్‌! | Is Imran Khan Insults Saudi King | Sakshi
Sakshi News home page

సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్‌!

Jun 6 2019 11:36 AM | Updated on Jun 6 2019 11:53 AM

Is Imran Khan Insults Saudi King - Sakshi

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై సోషల్‌ మీడియాలో విపరితమైన విమర‍్శలు వస్తున్నాయి. ఆయన సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ను అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రొటోకాల్‌ను కూడా ఉల్లఘించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత వారం సౌదీ ప్రభుత్వం మక్కాలో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైన ఇమ్రాన్‌ సౌదీ రాజు వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్‌ ఇమ్రాన్‌ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు.  అయితే చివర్లో ఇమ్రాన్‌ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్‌ రాజుకు వివరించలోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే సౌదీ రాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్‌ బాడీ లాంగ్వేజ్‌ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్‌ ప్రవర్తన కారణంగా ఆ తర్వాత సౌదీ, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. 57 దేశాలు సభ్యత్వం ఉన్న ఓఐసీ ప్రపంచంలోని ముస్లింల కోసం పనిచేస్తున్నట్టు ప్రకటించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement