ఈ వీడియో చూసి మీరు నోరెళ్లబెట్టాల్సిందే..!

The Human Flesh Coin Purse - Sakshi

ఇంతకీ ఏమిటిది.. విషయం తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టాల్సిందే.. ఎందుకంటే.. ఇది ఓ పర్సు.. చూడ్డానికి అచ్చం మనిషి నోరులా కనిపిస్తున్న ఈ వినూత్న పర్సును జపాన్‌కు చెందిన మ్యూజిక్‌ కంపోజర్, ఆర్టిస్ట్‌ డూ డిజైన్‌ చేశారు. ఆ పళ్లు, పెదాలు అన్నీ.. తేడా అస్సలు తెలియనట్లు తయారుచేయడం విశేషం. పర్సు తెరవాలంటే.. ఇలా నోరు తెరవాల్సిందే. ప్రస్తుతానికి దీని తాలూకు వీడియోను డూ తన ట్విటర్‌ ఖాతాలో పెట్టారు. ఏం సామగ్రితో దీన్ని తయారు చేశారని ప్రశ్నిస్తే.. అది రహస్యమని బదులిచ్చారు. ఇప్పటికే దీని రేటెంత..? కొంటాం అని అడిగేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. ప్రస్తుతానికి దీన్ని మార్కెట్లోకి తెచ్చే ఆలోచన తనకు లేదని డూ చెబుతున్నారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top