వాళ్లు కలవటం మాటేమోగానీ...

Hilarious Memes on Trump Kim Summit - Sakshi

సింగపూర్‌ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు తటస్థ వేదికగా సమావేశం కావటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా కారాలు-మిరియాలు నూరుకుంటూ.. అసభ్యంగా తిట్టుకున్న వీరిద్దరూ... ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకున్న వైనం ఆకట్టుకుంది. ఆపై అనువాదకుల సాయంతో వారిద్దరూ తమ సమావేశాన్ని వారిద్దరూ కొనసాగించారు. అయితే వారి కలయిక సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో కొనసాగగా.. అదే స్థాయిలో ట్రోలింగ్‌.. మెమెలతో పలువురు విరుచుకుపడ్డారు. చారిత్రాత్మక భేటీని హిల్లేరియస్‌ పోస్టులతో మార్చి పడేస్తున్నారు. వాటిలో కొన్ని మీకోసం...

సోమవారం సింగపూర్‌లో నిరాయుధీకరణే ప్రధాన ఏజెండాగా సాగిన భేటీ చివరకు విజయవంతంగా పూర్తయినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఒప్పంద పత్రాల ప్రతుల ఫోటోలు, వాటిపై అమెరికా-డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర) అధ్యక్షుల సంతకాలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top