నాకు కరాటే వచ్చు.. నేను కిక్‌ ఇస్తే అంతే..!

grand mother kick the drunk youth in the bus

ప్రయాణ సమయంలో ఓ ప్యాసింజర్‌కు అరుదైన అనుభవం ఎదురైంది. మద్యం సేవించి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడిపై బామ్మ దాడికి దిగింది. ఈ సంఘటన కజికిస్తాన్‌లోని ఒక సిటీలో చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మరో ప్రయాణికుడు ఈ ఘటనను మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది.

వివరాలివి.. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను పరిశీలిస్తే.. వృద్ధురాలు హఠాత్తుగా ఆ యువకుడి చెంపపై కొట్టింది. కూర్చొన్న సీటులో నుంచి లేవమని అతనిపై గట్టిగా అరిచింది. ‘అంతటితో ఆగకుండా బస్సులో నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. మద్యం సేవించిన వాళ్లు అంటే నాకు నచ్చదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని’ అతడితో అన్నది.

ఆ యువకుడు బామ్మ నుంచి దూరంగా వెళ్లుతూ.. ‘మీ చేతులను అదుపులో ఉంచుకోవాల’ని అన్నాడు. అతడి మాటలకు ఆమె కోపంతో​ మరింత రెచ్చిపోయింది. ఆ యువకుడిని వెనక్కి నెట్టి, కాళ్లతో కూడా తన్నింది. ‘నాకు కరాటే వచ్చు.. నేను కిక్‌ ఇస్తే అంతే సంగతి. నాకు మందు తాగే వాళ్లంటే ఇష్టం ఉండద'ని కేకలు వేసింది. పాపం ఆ యువకుడు బామ్మ దెబ్బకు భయపడి అక్కడి నుంచి వెళ్లి బస్సులోనే మరోవైపు కూర్చున్నాడు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top