దుబాయ్‌లో సరికొత్త నిబంధన; మీరితే భారీ జరిమానా!

Dubai May Impose Heavy Penalty For Parking A Dirty Car - Sakshi

దుబాయ్‌ : కఠిన చట్టాలకు మారుపేరైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మరో సరికొత్త నిబంధన తీసుకువచ్చింది. ప్రజా రహదారుల్లో మురికిగా ఉన్న కార్లను పార్క్‌ చేస్తే 500 దీనార్లు(దాదాపు రూ.9000) జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు దుబాయ్‌ మున్సిపాలిటి నిబంధనలు జారీ చేసింది. మున్సిపల్‌ ఇన్స్‌పెక్టర్లు తరచుగా వాహనాలను చెక్‌ చేస్తారని, మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు అందజేస్తారని పేర్కొంది. ఒకవేళ ఇది పునరావృతమైతే కారును స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని వెల్లడించింది.   

అదే విధంగా.. ‘ పర్యావరణహిత పట్టణం కోసం ఈ నిబంధనలు’ అని ట్వీట్‌ చేసిన దుబాయ్‌ మున్సిపాలిటి... పర్యాటకులు కూడా ఈ కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోవాలని కోరింది. గల్ఫ్‌ దేశమైన యూఏఈ ఆదాయంలో పర్యాటకానిది కూడా సింహభాగమని చెప్పవచ్చు. నిరంతరం పర్యాటకుల తాకిడితో వెలుగొందే ముఖ్య పట్టణాల్లో ఇలాంటి నిబంధనలు విధించడం ద్వారా వారికి మరింత ఆహ్లాదం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top