రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు! | Donald Trump Praises russian president Putin | Sakshi
Sakshi News home page

రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు!

Dec 31 2016 10:13 AM | Updated on Aug 25 2018 7:50 PM

రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు! - Sakshi

రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అధికారిక మెయిల్స్ ను హ్యాకింగ్ చేసిందని పలు ఆరోపణలున్నాయి.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అధికారిక మెయిల్స్ ను హ్యాకింగ్ చేసిందని పలు ఆరోపణలున్నాయి. తమ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమికి పరోక్షంగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా కారణమిని డెమొక్రటిక్ పార్టీ కీలకనేతలు, ప్రస్తుత అధ్యక్షడు బరాక్ ఒబామా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా తరహాలో తాను ఎలాంటి చర్యలు తీసుకోనని పుతిన్ ఇలా అన్నారో లేదో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా అగ్రనేతను తెగ పొగిడేశారు. 35 మంది రష్యా అధికారులను ఒబామా గత గురువారం తొలగించారు. కానీ, పుతిన్ అలాంటి పని చేయరని ఎందుకుంటే ఎప్పటి నుంచో ఆయన టూ స్మార్ట్ అని సోషల్ మీడియాలో ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. రష్యాతో తన అనుబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. రష్యా నేత తెలివిగా వ్యవహరిస్తారని మన దేశ అధికారులకు ఏ విధంగానూ అక్కడి నుంచి సమస్యలు రావని నిశ్చింతగా ఉండొచ్చునని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే మేరీలాండ్, న్యూయార్క్ లలో షెల్టర్ తీసుకుని రష్యా నిఘా అధికారులు తమకు ద్రోహం చేస్తున్నారని అమెరికా భావిస్తుంది. అమెరికా చేసినట్లుగా తాను ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులను తప్పించే ప్రసక్తేలేదన్నారు. అమెరికా అధికారులకు తాను తలనొప్పిగా మారనని, రష్యా-అమెరికా మైత్రిని తాను కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. కొన్ని రోజుల తర్వాత ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement