మీ చెయ్యే.. మీ ఫోన్ స్క్రీన్..! | Do your hand to your phone screen! | Sakshi
Sakshi News home page

మీ చెయ్యే.. మీ ఫోన్ స్క్రీన్..!

Jul 26 2014 12:04 AM | Updated on Sep 29 2018 5:26 PM

మీ చెయ్యే.. మీ ఫోన్ స్క్రీన్..! - Sakshi

మీ చెయ్యే.. మీ ఫోన్ స్క్రీన్..!

మీరు డ్రైవింగ్‌లో ఉన్నారు.. ఈలోగా మీ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. ఫోన్ తీయకుండానే దాన్ని మీ చేతిపైనే చూసుకోగలిగితే.. బావుంటుంది కదూ?

మీరు డ్రైవింగ్‌లో ఉన్నారు.. ఈలోగా మీ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. ఫోన్ తీయకుండానే దాన్ని మీ చేతిపైనే చూసుకోగలిగితే.. బావుంటుంది కదూ? త్వరలోనే ఇది నిజం కానుంది. టైమ్‌తోపాటు ఈమెయిల్స్, ఎస్సెమ్సెస్‌లు, ఫేస్‌బుక్ పోసు ్టలు, నోటిఫికేషన్లు, రిమైండ ర్లు.. వీటన్నింటినీ కూడా చేతిపైనే చూసుకోవచ్చు. ‘రిటా ట్’ అనే ప్రొజెక్షన్ వాచ్‌తో ఇది సుసాధ్యం కానుంది. దీనిని చేతికి పెట్టుకుని, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకుంటే చాలు..

మన చెయ్యే ఫోన్ స్క్రీన్ అయిపోతుంది. టైమ్ చూడాలనుకుంటే ఒక్కసారి చేతిని ఊపితే సరిపోతుంది. ఏదైనా నోటిఫికేషన్ వస్తే.. ఈ వాచ్ వైబ్రేట్ అవుతుంది. ఎవరైనా ఫోన్ చేసినా, ఆ వివరాలు చేతిపై ప్రత్యక్షమైపోతాయి. ఉక్రెయిన్‌కు చెందిన మైకేల్ మెడ్విడ్ ఈ ప్రొజెక్టర్ వాచ్‌ను రూపొందించాడు. దీని ధర దాదాపు రూ.7వేలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇది అందుబాటులోకి రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement