దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Deadly in a road accident in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

May 12 2014 2:06 AM | Updated on Aug 30 2018 3:58 PM

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

దుబాయ్‌లో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు సహా 13 మంది మృతి చెందారు. జబేల్ అలీ ప్రాంతంలోని పని ప్రదేశానికి 27 మంది కార్మికులను తరలిస్తున్న మినీ బస్సు శనివారం రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.

9 మంది భారతీయులు సహా 13 మంది మృతి
 
 దుబాయ్: దుబాయ్‌లో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు సహా 13 మంది మృతి చెందారు. జబేల్ అలీ ప్రాంతంలోని పని ప్రదేశానికి 27 మంది కార్మికులను తరలిస్తున్న మినీ బస్సు శనివారం రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. మృతిచెందిన భారత కార్మికులందరూ బీహార్‌కు చెందిన వారని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.

మృతు ల్లో మిగిలిన వారు బంగ్లాదేశీయులు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత, బంగ్లా కార్మికులను రషీద్, అల్ బరాహా ఆస్పత్రులకు తరలించారు. పోస్ట్‌మార్టం తర్వాత కార్మికుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నట్లు భారత్ దౌత్యాధికారులు తెలి పారు. ప్రమాదానికి గురైన బస్సు, ట్రక్కు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిద్దరూ పాక్‌కు చెందిన వారని ‘గల్ఫ్ న్యూస్’ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement