ప్రధాని, ప్రెసిడెంట్ కలిసి మందేశారు | David Cameron Takes Xi Jinping to the Pub for Fish and Chips | Sakshi
Sakshi News home page

ప్రధాని, ప్రెసిడెంట్ కలిసి మందేశారు

Oct 23 2015 8:13 AM | Updated on Sep 3 2017 11:22 AM

ప్రధాని, ప్రెసిడెంట్ కలిసి మందేశారు

ప్రధాని, ప్రెసిడెంట్ కలిసి మందేశారు

ఎప్పుడూ నిత్యం తీరికలేని కార్యకలాపాలతో చిరాకుగా అనిపించిందో లేక తాము కూడా ఓసారి సామాన్య పౌరుల్లా గడిపేయాలనుకున్నారో.. ఏకంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కలిసి నాలుగు సిప్‌ల బ్రిటన్ సాంప్రదాయబద్ధమైన మత్తుపానీయం సేవించారు.

క్యాడ్సన్: ఎప్పుడూ నిత్యం తీరికలేని కార్యకలాపాలతో చిరాకుగా అనిపించిందో లేక తాము కూడా ఓసారి సామాన్య పౌరుల్లా గడిపేయాలనుకున్నారో.. ఏకంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కలిసి నాలుగు సిప్‌ల బ్రిటన్ సాంప్రదాయబద్ధమైన మత్తుపానీయం సేవించారు. ఈ విషయాన్ని డేవిడ్ కామెరూన్ స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా గురువారం జీజిన్ పింగ్ గురువారం కామెరూన్‌ను కలిశారు.

అనంతరం వారిద్దరూ కలిసి క్యాడ్సన్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అక్కడ స్వయంగా బిల్లు చెల్లించి మూడు క్వార్టర్ల 'ట్రెడిషనల్ ఇంగ్లిష్ బిట్టర్' సేవించారు. అనంతరం బ్రిటన్‌లో ఫేమస్ అయిన చేపలను, చిప్స్‌ను లొట్టలు వేసుకుంటూ తిన్నారు. వారిద్దరిని అక్కడ చూసి బార్‌లో ఉన్న మిగితా వారు ఆశ్చర్యపోగా.. ఆ బార్ షాపు యజమాని మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఓ ప్రధాని, అధ్యక్షుడు తన బార్ పబ్‌లో బిట్టర్ తీసుకోవడం, చేపలు, చిప్స్ తినడం తన జీవితంలోనే గొప్ప సంతోషకరమైన రోజంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement