పిరమిడ్‌పై పిచ్చి పని‌.. చిక్కుల్లో జంట! | Couple Allegedly Poses Naked For Photo And Video Atop Giza Pyramid | Sakshi
Sakshi News home page

Dec 8 2018 8:41 PM | Updated on Dec 8 2018 8:41 PM

Couple Allegedly Poses Naked For Photo And Video Atop Giza Pyramid - Sakshi

కైరో : పిరమిడ్‌పై ఓ జంట చేసిన పిచ్చి పని వారిని చిక్కుల్లో పడేసింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్‌ పిరమిడ్స్‌ను చూసేందుకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుంటారు. అయితే డెన్మార్క్‌కు చెందిన ఓ జంట మాత్రం భిన్నంగా ఆలోచించి... చిక్కుల్లో ఇరుక్కుంది. పిరమిడ్‌ ఎక్కడమే కాకుండా దానిపై నగ్నంగా పోజ్‌లు ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అవి కాస్త వైరల్ కావడంతో ఇప్పుడు కష్టోల్లో పడింది. 

వాస్తవానికి పిరమిడ్స్‌ను చూడటానికి మాత్రమే పర్యాటకులను అనుమతి ఇస్తారు. వాటిని ఎక్కడం నిషేధం. అయితే  డెన్మార్క్‌ చెందిన ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ హావిద్‌ తన ప్రియురాలితో కలిసి నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయంలో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాను ఎక్కారు. అక్కడ నగ్నంగా ఫొటోలు దిగారు. అనంతరం శృంగారం చేసుకుంటూ షూట్‌ చేశారు. మూడు నిమిషాల పాటు రికార్డు చేసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. టైటిల్‌ కూడా ఈజిప్ట్‌ పిరమిడ్స్‌పై శృంగారం చేశామంటూ పెట్టడంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన ఈజిప్ట్‌ ప్రభుత్వం డానిష్‌ జంటపై దర్యాప్తునకు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement