కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్‌ | Coronavirus Impct: One in Six UK Workers Could Lose Their Job | Sakshi
Sakshi News home page

ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్‌

Apr 11 2020 2:01 PM | Updated on Apr 11 2020 2:01 PM

Coronavirus Impct: One in Six UK Workers Could Lose Their Job - Sakshi

బ్రిటన్‌లో ఈ వైరస్‌ కారణంగా ప్రతి ఆరుగురులో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారు.

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతున్న విషయం తెల్సిందే. బ్రిటన్‌లో ఈ వైరస్‌ కారణంగా ప్రతి ఆరుగురులో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా 3.2 ఓట్ల మంది ఉద్యోగుల్లో 56 లక్షల మంది ఉద్యోగులకున ముంపు పొంచి ఉందని ‘న్యూ ఎకనామిక్స్‌ ఫౌండేషన్‌’ నిపుణులు అంచనా వేశారు. కంపెనీలు మూత పడిన కారణంగా ఇప్పటికే 16 లక్షల మంది రోడ్డున పడ్డారు.

కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించని పరిస్థితుల్లో 80 శాతం వేతనాలు చెల్లించడం ద్వారా వారిని ఆదుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం 312 లక్షల కోట్ల రూపాయలతో ఓ స్కీమ్‌ను ప్రకటించింది. నిర్దిష్ట కాల పరిమితి, జీరో అవర్‌ కాల పరిమితి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను కంపెనీలు తీసివేసిన పక్షంలో వారికి ఈ ప్రభుత్వం స్కీమ్‌ వర్తించదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే స్వయం ఉపాధి కింద పని చేస్తున్న వారికి జూన్‌ వరకు ఈ స్కీమ్‌ పని చేయదని, అప్పటి వరకు వారు ఏదో విధంగా మనుగడ సాగించగలరని అధికార వర్గాలు తెలిపాయి. జూన్‌ తర్వాత కూడా సంక్షోభ పరిస్థితులు కొన సాగితే అప్పుడు అలాంటి వారి గురించి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పాయి.

ఇది చదవండి: ఉద్యోగులకు బంపర్‌ బోనస్‌.. అయితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement