ఇవాంకకూ కరోనా సెగ! | Corona Effect: Ivanka Trump Working From Home As A Precaution | Sakshi
Sakshi News home page

ఇవాంకకూ కరోనా సెగ!

Mar 15 2020 2:09 AM | Updated on Mar 15 2020 2:09 AM

Corona Effect: Ivanka Trump Working From Home As A Precaution - Sakshi

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకకూ కరోనా సెగ తగి లింది. ఇవాంక గత శుక్రవారం ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్‌ డుటన్‌తో సమావేశమైంది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో పీటర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారం ఇవాంక తన ఆఫీస్‌ పనులను ఇంటి నుంచే చక్కబెట్టుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంటి నుంచే పనిచేసినట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు పీటర్‌ డుటన్‌ మాత్రం కొంతకాలం పాటు విడిగా (సెల్ఫ్‌ క్వారంటైన్‌)లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరే కరోనా వైరస్‌ బారిన పడగా.. ట్రూడో మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement