పాక్‌కు చైనా అత్యాధునిక డ్రోన్లు

China to sell 48 high-end military drones to Pakistan - Sakshi

బీజింగ్‌: చైనా– పాకిస్తాన్‌ మధ్య రహస్యంగా శక్తిమంతమైన ఆయుద ఒప్పందం జరిగింది. రష్యా నుంచి భారత్‌ అత్యాధునిక ఎస్‌–400 క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న వారం వ్యవధిలోనే పాకిస్తాన్‌ చైనాతో అతిపెద్ద ఆయుధ దిగుమతి ఒప్పందం కుదుర్చుకుంది.

చైనా నుంచి 48 అత్యాధునిక మానవ రహిత యుద్ధ విమానాల (మానవ రహిత హై ఎండ్‌ డ్రోన్‌) కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. రహస్యంగా జరిగిన ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడి కాలేదు. వింగ్‌ లూంగ్‌–2 సిరీస్‌కు చెందిన ఈ డ్రోన్లను పాక్, చైనా కలసి తయారు చేయనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు కలసి మల్టీరోలల్‌ యుద్ధ విమానాలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ తన వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిన అవశ్యం ఏర్పడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top